Begin typing your search above and press return to search.

విడిపోయినా నెస్‌ వాడియాను వదలని ప్రీతిజింటా

By:  Tupaki Desk   |   21 Feb 2018 11:30 PM GMT
విడిపోయినా నెస్‌ వాడియాను వదలని ప్రీతిజింటా
X
ప్రీతిజింటా - ఆమె ఒకప్పటి ప్రియుడు నెస్‌వాడియా మధ్య వివాదం నేపథ్యంలో ప్రీతిజింటా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమారు మూడున్నరేళ్ల తరువాత పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. తనపై లైంగిక దాడికి ప్రయత్నించడంతోపాటు అసభ్య పదజాలంతో దూషించాడనే ఆరోపిస్తూ నెస్‌ వాడియాపై ప్రీతిజింటా అప్పట్లో కేసు పెట్టింది. 2014 మే 30న ముంబయి వాంఖడే స్టేడియంలో వారిద్దరి మధ్య గొడవ జరిగి ప్రీతి కేసు పెట్టగా ముంబయి మెరైన్ పోలీసులు తాజాగా చార్జిషీట్ ఫైల్ చేశారు. ఐపీల్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ కు వీరిద్దరూ సహ యజమానులుగా ఉన్నప్పటి గొడవ ఇది.

వాంఖడే మైదానంలో 2014 మే 30న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో సేడియం టికెట్ల గురించి జట్టు సిబ్బందిపై నెస్‌ వాడియా దుర్బాషలాడారని ప్రీతి జింటా తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ తర్వాత తనతో గొడవ పడి తనపై అఘాయిత్యానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. తన చేతి పట్టుకొని లాగాడాని, అప్పుడు తన చేతికి అయిన గాయాలను ఫొటోలతో సహా పోలీసులకు అందజేసింది.

కాగా ఈ కేసులో ముంబయి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 200 పేజీల చార్జిషీట్‌ ను దాఖలు చేసింది. ఈ కేసులో నెస్ వాడియా 20 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ తీసుకొన్నాడు. 2014 జూన్ 13న ప్రీతిజింటా దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా నెస్ వాడియాపై ఐపీసీ సెక్షన్ 354 (మహిళపై నేరపూరిత దాడి), 506 (నేరపూరిత దాడి), 509 (మహిళపై అశ్లీల పదజాలం - దూషణ) కింద కేసు నమోదు చేశారు. తమ మధ్య బంధానికి పుల్‌ స్టాప్ పడిన తర్వాత వేధింపుల పర్వం ఎక్కువైందని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. ప్రీతిజింటా - నెస్ వాడియా కేసులో దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తండ్రి అండ్రూ మిల్లర్ కీలకమైన సాక్షిగా మారడం వివాదం కొత్త మలుపు తిరిగింది. వారిద్దరూ గొడవ పడటం చూశానని ఆయన చెప్పారు. అయితే.. చేయిపట్టి లాగడం చూడలేదన్నారాయన. మరోవైపు ఈ కేసులో అమెరికా జాతీయుడు జీన్ గుడెనఫ్ కూడా ఓ సాక్షి. నెస్ వాడియాతో విడిపోయాక ప్రీతి 2016లో ఈయన్నే పెళ్లి చేసకుంది.