Begin typing your search above and press return to search.
పంజాబ్ జట్టుని బూతులు తిట్టిన ప్రీతి జింటా
By: Tupaki Desk | 12 May 2016 1:06 PM GMTఆటలో గెలుపోటములు సహజం. గెలవాలన్న కాంక్ష బలంగా ఉండాలి. గెలుపు కోసమే ఆడాలి. కానీ ఓటమిని జీర్ణించుకోలేకపోతే మాత్రం కష్టం. ముఖ్యంగా ఆటగాళ్ల కంటే కూడా వాళ్లను నడిపించే వాళ్లకు ఎక్కువ సహనం ఉండాలి. ఓడినపుడు ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలి. మరింత బాగా ఆడేలా స్ఫూర్తి రగిలించాలి. అలా కాకుండా జట్టును బూతులు తిడితే లాభం ఏముంటుంది..? ఈ సంగతి గ్రహించలేక నిగ్రహం కోల్పోయింది ప్రీతి జింటా.
మొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. స్టాండ్స్ లో నుంచి మ్యాచ్ చూస్తూ బంతి బంతికీ తీవ్ర ఉత్కంఠను అనుభవించింది ప్రీతి. 4 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టు ఆటగాడు సిక్సర్ బాదడంతో మ్యాచ్ పంజాబ్ వైపు మొగ్గినట్లే అనుకున్నారు. కానీ చివరి 3 బంతులకు 4 పరుగులే వచ్చాయి. పంజాబ్ ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. దీంతో ప్రీతి ఆగ్రహాన్ని అణచుకోలేకపోయింది.
అసలే సీజన్ ఆరంభం నుంచి పంజాబ్ ప్రదర్శన బాలేకపోగా.. ఇలా చేతిలో ఉన్న మ్యాచ్ లో ఓడిపోవడంతో ఆటగాళ్లుండే డగౌట్ దగ్గరికి వచ్చి అందరినీ బూతులు తిట్టిందట ప్రీతి. ముఖ్యంగా కోచ్ సంజయ్ బంగర్ ను ఉద్దేశించి.. ‘ఎఫ్’ వర్డ్ కూడా వాడిందట. దీంతో అతడికి కూడా ఒళ్లు మండి ఆమెతో వాగ్వాదానికి దిగాడట. అయినా ప్రీతి తగ్గలేదట. నిన్ను కోచ్ పదవి నుంచి తీసేస్తానంటూ బెదిరించిందట. మరిన్ని బూతులు తిట్టిందట. చివరికి బంగర్ అలిగి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడట. అయినా ప్రీతి శాంతించలేదని సమాచారం. ప్రీతి ప్రవర్తన మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.