Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే ఆఫీస్ ఎదుట ప్రియురాలి హడావుడి
By: Tupaki Desk | 22 Jun 2018 11:31 AM ISTకర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ మధ్యనే ముగిసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికల్లో మరో సంచలన అంశం ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ నేత.. 54 అవివాహిత నేతగా అందరికి సుపరిచితుడైన రామదాసు ప్రియురాలిని అంటూ ఒక మహిళ చేస్తున్న హడావుడి అప్పట్లో సంచలనంగా మారింది. ఒకదశలో తన లవ్వర్ పైన పోటీ అంటూ ప్రకటనలు చేసినా.. మళ్లీ వెనక్కి తగ్గారు.
నాలుగేళ్ల క్రితం కూడా తాను రామదాసు ప్రియురాలినంటూ సదరు మహిళ రచ్చ రచ్చ చేశారు. దీంతో మనస్తాపం చెందిన రామదాసు 2014లో ఒకసారి ఆత్మహత్యా యత్నం చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా రామదాసు లవ్వర్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రేమకుమారి తాజాగా మరోసారి రచ్చ రచ్చ చేశారు.
గురువారం ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ప్రత్యక్షమైన ఆమె.. ఎమ్మెల్యే రామదాసు తన భర్త అని.. ఆయన బతికి ఉన్నంత కాలం తాను రామదాసుతోనే జీవిస్తానని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి తనకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న రామదాసును తాను పట్టుకుంటానని.. ఆయనకు పట్టిన దెయ్యాన్ని విడిపిస్తానంటూ తీవ్ర స్వరంతో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.