Begin typing your search above and press return to search.
అహ్మదాబాద్ అంతా ట్రంప్ మయం..
By: Tupaki Desk | 18 Feb 2020 11:45 AM GMTఅగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24 - 25 వ తేదీలలో గుజరాత్ లో పర్యటించబోతున్నారు. దీనికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో గుజరాత్ అధికారులు యుద్దప్రాతిపాదికన ఏర్పాట్లని పూర్తిచేస్తున్నారు. అమెరికా నుండి నేరుగా ఆయన గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనున్నారు. ఈ పర్యటనకి ట్రంప్ తన భార్య మెలానియా ట్రంప్ తో సహా రానున్నారు.
ఇక అగ్రరాజ్యం అధినేత పర్యటనకి రాబోతుండటంతో ..ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మురికివాడలు ట్రంప్ కి కనపడకుండా.. అడ్డుగా కట్టిన గోడలను అందంగా తీర్చిదిద్దారు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. మురికివాడలు కనిపించకుండా కట్టిన గోడలని ఆకుపచ్చని రంగుతో పూర్తిగా నింపేశారు. అలాగే ఆ గోడలపై నరేంద్ర మోడీ - డొనాల్డ్ ట్రంప్ పెయింటింగ్ లను వేశారు. భారత్ - అమెరికా మధ్య గల దౌత్య సంబంధాలను ఉటంకిస్తూ రూపొందించిన స్లోగన్లను రాశారు. ముఖ్యంగా స్వచ్ఛభారత్ గురించి కూడా కొన్ని పెయింటింగ్స్ వేశారు.
ముఖ్యంగా అహ్మదాబాద్ నగరం వ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ - నరేంద్ర మోడీలతో కూడిన బ్యానర్లు - హోర్డింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా ట్రంప్ రాకపోకలు సాగించే మార్గంలో భారీ ఎత్తున - అత్యంత ఆకర్షణీయంగా వాటిని ఏర్పాటు చేశారు. నమస్తే ట్రంప్ - కెమ్ ఛో ట్రంప్ అనే నినాదాలను వాటిపై ముద్రించి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. ఇకపోతే , ఇదే సమయంలో ..ట్రంప్ తన పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే పెద్దదైన క్రికెట్ స్టేడియం ని ప్రారంభించనున్నారు. దీనితో ఈ మొతెరా స్టేడియం సమీపంలోని మురికివాడలను ఖాళీ చేయించారు ,అక్కడి నివాసులను ఇతర ప్రాంతాలకు తరలించారు. మురికివాడల నివాసితులను షెల్టర్ జోన్లకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ వారికి అన్ని రకాల సదుపాయాలను ఏర్పాట్లు చేసినట్లు చెప్తున్నారు, అయితే , అహ్మదాబాద్ అధికారుల ఈ చర్యల పట్ల కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొతెరాలోని సర్దార్ వల్లభ్ భాయ్ స్టేడియం వరకూ నరేంద్ర మోడీ - డొనాల్డ్ ట్రంప్ రోడ్ షోను నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోని దృష్టిలో పెట్టుకొని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడానికి గుజరాత్ పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. గుజరాత్ పోలీస్ యంత్రాంగంతో పాటుగా ..ట్రంప్ వచ్చే ముందు రోజు నుండే అక్కడ పెద్ద ఎత్తున పారా మిలటరీ బలగాలను మోహరించనున్నారు.