Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర లో సంకీర్ణ ప్రభుత్వానికి సర్వం సిద్ధం ... ఒప్పందం ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   14 Nov 2019 9:38 AM GMT
మహారాష్ట్ర లో సంకీర్ణ ప్రభుత్వానికి సర్వం సిద్ధం ... ఒప్పందం ఏమిటంటే ?
X
మహా రాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటు పై ఇప్పటికి కూడా ఇంకా ప్రతిష్టంభన అలాగే కొన సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన లో ఉన్న ఈ మహారాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేనలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగం గానే ఒక పార్టీ తో మరొక పార్టీ చర్చలు జరుపుతోంది. ఎన్సీపీ -కాంగ్రెస్‌ లు బీజేపీ కి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు శివసేన తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి.

నాకు దక్కనిది ఇంకెవరికి దక్క కూడదు అన్నట్టుగా సాగుతోంది బీజేపీ ప్రయాణం అని శివసేన నేతలు బీజేపీ పై విరుచుకు పడుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకి ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆఘమేఘాలపై రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారు అంటూ బీజేపీ ని ప్రశ్నిస్తున్నారు శివసేన నేతలు. కానీ అంతా రాజ్యాంగం ప్రకారమే చేసాము అని బీజేపీ చెప్తుంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటు కు శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయని తెలుస్తోంది. అందు లో భాగంగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ లు ఒక ఒప్పందానికి వచ్చాయని ఒక టాక్ వినిపిస్తోంది.

ఈ ఒప్పందం ఏమిటంటే .. ఎన్సీపీ-శివసేనలు ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల పంచుకుంటాయట. ఉప ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ కు ఐదేళ్ల పాటు ఇవ్వబోతున్నారట, ఇక మంత్రి పదవుల విషయం లో శివసేన, ఎన్సీపీలు సగంసగం ఫార్ములా ని ఫాలో కాగా , కాంగ్రెస్ పార్టీ కి పదకొండు పదవులు ఇవ్వడానికి ఒకే చెప్పినట్టు సమాచారం.ఇలా రాజీ ఫార్ములా ను రెడీ చేసుకొని , సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే , ఈ ఒప్పందాల కు మూడు పార్టీలు కట్టుబడి ఉంటాయా? లేదా ?అనేది కాలమే సమాధానం చెప్పాలి. మరో విషయం ఈ ముగ్గురు కలిసి మహారాష్ట్ర ని పాలిస్తుంటే ..బీజేపీ సైలెంట్ గా ఉంటుందా?