Begin typing your search above and press return to search.
కమల్ డెసిషన్: చావడానికైనా రెడీ
By: Tupaki Desk | 2 Oct 2017 9:01 AM ISTప్రస్తుత పాలకులపై విసిగెత్తిపోయానని - అవినీతి పెరిగిపోయిందని తన సొంత స్టైల్లో విమర్శలు గుప్పించిన విశ్వనటుడు కమల్ హాసన్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇలా ప్రకటించిన నాటి నుంచి కమల్ చేస్తున్న విరుద్ధమైన ప్రకటనలు రాజకీయంగానే కాకుండా సామాన్యులకు కూడా ఓ పట్టాన అర్థం కావడం లేదు. కొంత సేపు సొంతంగా పార్టీ పెడతానని, రజనీకాంత్ లాంటి వాళ్లు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. మరికొంత సేపు అవసరమైతే బీజేపీతో చేతులు కలిపేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజల యోగ క్షేమాలే తనకు కీలకమని వారి కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఇక, తనకు కమ్యూనిస్టు సిద్ధాంతంతో పాటు అన్ని సిద్ధాంతాలూ ఇష్టమని కమల్ చెప్పారు. అయితే, తాను ఫాలో అయ్యే సిద్ధాంతం ఏంటనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇలా రోజుకో రకంగా మాట్లాడుతున్న కమల్.. తాజాగా మళ్లీ మార్చాడు. నిన్న మొన్నటి వరకు తాను తమిళనాడుకే పరిమితం అని ప్రకటించిన ఈ శభాష్ నాయుడు ఇప్పుడు మాత్రం దేశానికి సేవ చేస్తూ మరణించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రియాల్టీ షో ‘బిగ్ బాస్’ ఫైనల్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం కచ్చితమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రేక్షకులవైపు చూస్తూ ‘‘నేను కచ్చితంగా వస్తున్నాను’’ అన్నారు.
`బిగ్ బాస్` వేదికను తాను స్వార్థం కోసం ఉపయోగించుకోవడం లేదన్నారు. తాను తన గుండె లోతుల్లోంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. ‘‘నేను నటించడాన్ని కొనసాగించాలని మీరు(ప్రేక్షకులు) అనుకుంటే, ఆ విషయాన్ని గట్టిగా చెప్పండి. నేను సమాజానికి సేవ చేయవలసిన అవసరం ఉందని, మార్పు తేవలసిన అవసరం ఉందని మీరు భావిస్తే, ఆ విషయాన్ని ఇప్పుడే చెప్పండి. దేశ సేవలో మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను’’ అని ప్రేక్షకులకు చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే నెటిజన్లు కామెంట్లు కుమ్మరిస్తున్నారు. ప్రజల అభిప్రాయం తీసుకున్నాక రాజకీయాల్లోకి వస్తారా? లేక మీరు పాలిటిక్స్ పై ఓ నిర్ణయం తీసుకుని అంతా అయిపోయాక మమ్మల్ని వీపీలను చేసేందుకు ఇలా అడుగుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. పాలిటిక్స్ లోకి రాకముందే.. స్థిరత్వం లేకుండా ఇలా మాట్లాడితే.. ఎలా అంటూ.. మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి వీటికి కమల్ సమాధానం చెబుతాడా? లేదా? చూడాలి.