Begin typing your search above and press return to search.

బ్రేక్ ఫాస్టుకని పిలిచి బ్లాక్ మెయిల్ చేసిన ట్రంప్

By:  Tupaki Desk   |   25 Jan 2017 7:37 AM GMT
బ్రేక్ ఫాస్టుకని పిలిచి బ్లాక్ మెయిల్ చేసిన ట్రంప్
X
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్‌ అప్పుడే తాను చెప్పింది చేయడం మొదలుపెడుతున్నారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో వచ్చిన ఆయన ఇప్పుడు విదేశాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇస్తున్న తమ దేశ కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. అది కూడా మర్యాదపూర్వకంగా బ్రేక్ ఫాస్ట్ కోసమని పిలిచి కూర్చోబెట్టి.. స్మూత్ మ్యానర్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అమెరికాలోని టాప్‌ 12 కంపెనీలకు చెందిన బిజినెస్‌ లీడర్లకు వైట్‌ హౌస్‌ లో బ్రేక్‌ ఫాస్ట్‌ పెట్టి మరీ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటే అందుకు భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చేకంపెనీలకు మాత్రం బంపర్‌ ఆఫర్‌లు ఉంటాయిని ట్రంప్‌ వెల్లడించారు. ఇలాంటి కంపెనీలకు పన్నుల విషయంలో వెసులుబాటు కలిపిస్తామని హామీ ఇచ్చారు. ఉత్పత్తి రంగాన్ని తిరిగి అమెరికా స్వాధీనంలోకి తెచ్చుకునేలా పనిచేయాలని ట్రంప్ బిజినెస్ లీడర్లకు పిలుపునిచ్చారు.ఒకవేళ విదేశాలకు ఉద్యోగాలు తరలిస్తే, తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

మరోవైపు ట్రంప్‌ హెచ్చరికల ప్రభావం ఐటీ కంపెనీలపై అప్పుడే కనిపిస్తోంది. ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ ఇకపై అమెరికాలో స్థానికులకే ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. హెచ్-1బీ వీసాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోనుంది హెచ్‌సీఎల్‌. వీసాలను మరింత తగ్గిస్తామని చెబుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/