Begin typing your search above and press return to search.
ట్రంప్ మాట ఆయన భార్యకు వర్తించదా?
By: Tupaki Desk | 21 May 2017 9:43 AM GMTఅమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్ మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉండదన్న విషయం మరోసారి రుజువైంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటనను ఆయన ఇస్లాం దేశమైన సౌదీ అరేబియాతో షురూ చేయటం విశేషం. మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయన జెరూసలెం.. వాటికల్ సిటీలను సందర్శించనున్నారు.
మిగిలిన పర్యటనలో ఎలాంటి విశేషాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సౌదీ అరేబియాలో మహిళల వస్త్రధారణ విషయంలో ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకొని ఆయా దేశాలకు వచ్చే అధినేతల సతీమణులు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఇందులో భాగంగానే గతంలో ఒబామా సతీమణి మిషెల్లీ ఆచితూచి వ్యవహరించేవారు. విడి సమయాల్లో తరచూ స్కర్ట్ ల్లో కనిపించే ఆమె.. సౌదీకి వెళ్లినప్పుడు మాత్రం పొడవాటి దుస్తులు ధరిస్తూ జాగ్రత్తలు తీసుకునేవారు. అయితే.. తల మీద తప్పనిసరిగా వస్త్రాన్ని ధరిస్తుంటారు. అయితే.. 2015లో సౌదీని ఒబామా పర్యటించిన సందర్భంగా తల మీద ధరించాల్సిన వస్త్రాన్ని మిషెల్లీ ధరించకపోవటాన్ని ట్రంప్ ప్రస్తావించారు.
తల మీద వస్త్రాన్ని ధరించకపోవటం సౌదీ అరేబియా వాసుల్ని చిన్నబుచ్చినట్లు అవుతుంది కదా? అని ట్రంప్ అప్పట్లో వ్యాఖ్యానించారు. తాజాగా అధ్యక్ష హోదాలో సౌదీలో అడుగు పెట్టిన ఆయన.. తన భార్య విషయంలో గతంలో తాను చెప్పిన మాటల్ని పూర్తిగా మర్చినట్లు కనిపించింది.
పొడవాటి చేతులతో.. పాదాల దాకా జీరాడున్న వదులైన నల్లటి దుస్తులు ధరించిన మెలానియా విమానంలో నుంచి బయటకు వచ్చారు. నడుము చుట్టూ బంగారు వర్ణంతో బెల్ట్ లాంటి అమరిక చూపురుల్ని ఆకట్టుకునేలా ఉంది. అయితే.. తల మీద వస్త్రాన్ని మెలానియా కూడా మర్చిపోయారు. గతంలో ఇదే పని చేసిన మిషెల్లీ విషయంలో ట్రంప్ చెప్పిన నొచ్చుకునే మాటను తన భార్య దగ్గరకు వచ్చేసరికి మర్చిపోవటం ఏమిటన్న ప్రశ్న పలువురి నోట వస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/