Begin typing your search above and press return to search.

పెద్దాయ‌న ఎన్నిక‌కు గంట మోగింది

By:  Tupaki Desk   |   7 Jun 2017 5:24 PM GMT
పెద్దాయ‌న ఎన్నిక‌కు గంట మోగింది
X
పిల్ల‌లు చదువుకునే పుస్త‌కాల్లోనే కాదు.. చాలా సంద‌ర్భాల్లో ర‌బ్బ‌రు స్టాంప్ గా అభివ‌ర్ణించే దేశ ప్ర‌ధ‌మ పౌరుడి ఎన్నిక‌కు గంట మోగింది. ఐదేళ్ల‌కోమారు జ‌రిగే ఈ ఎన్నిక దాదాపుగా ఏక‌ప‌క్ష‌మే. అధికార‌ప‌క్షానికి పూర్తిస్థాయిలో మెజార్టీ ఉంటే ఓకే. లేదంటే.. కొన్ని ప్రాంతీయ పార్టీల్ని కాసింత బుజ్జ‌గిస్తే.. అధికార‌ప‌క్షం బ‌రిలో నిలిపిన అభ్య‌ర్థికి ఓటేయ‌టం మామూలే. పేరుకు ర‌బ్బ‌రు స్టాంప్ అని చెప్పినా.. లెక్క తేడా వ‌చ్చే వేళలో.. ఆయ‌నే కీల‌కం కావ‌టం తెలిసిందే.

తాజాగా నెల‌కొన్న ప‌రిస్థితుల్లో రాష్ట్రప‌తి ఎన్నిక నామ‌మాత్ర‌మేన‌ని చెప్పాలి. యూపీ ఎన్నిక‌ల్లో బంపర్ మెజార్టీ సాధించటంతో రాష్ట్రప‌తి ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన ఎల‌క్ట్రోర‌ల్ కాలేజీ ఓట్లు దండిగా వ‌చ్చాయ‌ని చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన ఓట్ల కోసం టీఆర్ఎస్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీకి ద‌న్నుగా నిల‌వ‌టం.. అదే బాట‌లో త‌మిళ‌నాడు అధికార‌ప‌క్షం అన్నాడీఎంకే కూడా రెఢీ కావ‌టంతో.. రాష్ట్రప‌తి ఎన్నిక ఎన్డీయే అభ్య‌ర్థికి అనుకూలంగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే.. అస‌లు రాష్ట్రప‌తి లాంటి అత్యున్న‌త ప‌ద‌వికి పోటీ ఏమిటి? ఎన్నిక ఏమిటి? అంటూ ప్ర‌శ్నించే వారూ లేక‌పోలేదు. అంత పెద్ద ప‌ద‌వికి సంబంధించిన ఎన్నిక‌ను అన్ని రాజ‌కీయ‌ప‌క్షాలు క‌లిసి ఎక‌గ్రీవంగా నిర్ణ‌యం తీసుకుంటే ఎంతో బాగుంటుంది. అలాంటి రాజ‌కీయ వాతావ‌ర‌ణం దేశంలో లేని నేప‌థ్యంలో పోటీ అనివార్య‌మ‌నే చెప్పాలి.

జులై 24తో రాష్ట్రప‌తి ప‌ద‌వీ కాలం పూర్తి కానున్న నేప‌థ్యంలో.. ఆర్టిక‌ల్ 324 ప్ర‌కారం ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తున్న‌ట్లుగా కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి న‌సీమ్ జైదీ వెల్ల‌డించారు. రాష్ట్రప‌తి.. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ వివ‌రాల్ని ఆయ‌న తాజాగా వెల్ల‌డించారు. రాష్ట్రప‌తి.. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ ను ఈ నెల 14న నోటిఫికేష‌న్ ను జారీ చేస్తార‌ని ఆయ‌న చెప్పారు.

జులై 17న పోలింగ్‌ను నిర్వ‌హిస్తామ‌ని.. జులై 20న ఓట్ల లెక్కింపు ఉంటుంద‌ని వెల్ల‌డించారు. జులై 12న ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కూ ఓట్లు వేసే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. ఇక‌.. ఓట్ల లెక్కింపు కార్య‌క్ర‌మం జులై 20న ఉద‌యం 11 గంట‌ల నుంచి ప్రారంభిస్తామ‌ని చెప్పారు. రాష్ట్రప‌తిగా బ‌రిలోకి దిగే అభ్య‌ర్థికి క‌నీసం 50 మంది ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌తిపాదించి బ‌ల‌ప‌ర్చాల‌ని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/