Begin typing your search above and press return to search.

రైతులకు సలాం.. జవాన్లకు ప్రణామ్: రాష్ట్రపతి

By:  Tupaki Desk   |   26 Jan 2021 4:44 AM GMT
రైతులకు సలాం.. జవాన్లకు ప్రణామ్: రాష్ట్రపతి
X
కరోనా మహమ్మారి విలయం నుంచి కోలుకుంటూ.. సరిహద్దులో ప్రత్యర్థులు విసిరే సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత్ 72వ రిపబ్లిక్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం.. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ దేశప్రజలను ఉద్దేశించి సోమవారం సాయంత్రం ప్రసంగించారు. కరోనా సమయంలో రైతన్నలు.. వారియర్ల స్ఫూర్తిని కొనియాడుతూ.. చైనా కుయుక్తులను తిప్పికొట్టిన భారత్ సైన్యం ధీరత్వానికి గర్విస్తూ రాష్ట్రపతి ప్రసంగించారు.

సరిహద్దుల్లో చైనా దేశం తీరుపై భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మండిపడ్డారు. చైనా విస్తరణ వాదాన్ని ఎండగట్టారు. దేశ సరిహద్దుల్లో విస్తరణ ప్రయత్నాలను భారత్ చవిచూసిందని.. మన సాహస సైనికులు చైనా కుట్రలను విఫలం చేశారని కొనియాడారు. గల్వాన్ లోయలో 20 మంది సైనికులు అమరులయ్యారని కొనియాడారు.

దేశ భద్రత కోసం సైనికులు సియాచిన్, గల్వాన్ లోయలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ భద్రత కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని రామ్నాథ్ కోవింద్ కొనియాడారు.

దేశ ఆహార భద్రతకు నిరంతరం కష్టపడే మన రైతన్న తరహాలోనే మన వీర సైనికులు సైతం సరిహద్దుల్లో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారని అన్నారు.

కరోనా మహమ్మారి, ప్రకృతి ప్రకోపాలు సహా అనేక సవాళ్లను అధిగమించి దేశానికి అవసరమైన ఆహారాధాన్యాలను అందిస్తున్న రైతులకు ప్రతీ భారతీయుడు సలాం చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చాడు. రైతు సంక్షేమానాకి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఢిల్లీలో రైతుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్రపతి కీలక ప్రసంగం చేశారు.