Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి నోట విశాఖ మాట

By:  Tupaki Desk   |   22 Feb 2022 2:30 AM GMT
రాష్ట్రపతి నోట విశాఖ మాట
X
ఆయన దేశానికి ప్రధమ పౌరుడు. రాజ్యాంగ రక్షకుడు. ఒక విధంగా చెప్పాలీ అంటే దేశానికి ఆయనే సర్వ సైన్యాధ్యక్షుడు. అలాంటి రాష్ట్రపతి విశాఖ వచ్చారు. రామ్ నాధ్ కోవింద్ రాష్ట్రపతిగా విశాఖ రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఆయన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన విశాఖ గురించి కూడా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. విశాఖను అందాల నగరం అని కితాబు ఇచ్చారు. విశాఖలో శతాబ్దాల క్రితమే నావికాదళ కార్యకలాపాలు మొదలయ్యాయని, అంతటి ఘన చరిత్ర ఈ సిటీకి ఉందని కూడా చెప్పారు.

విశాఖకు ఒక అద్భుతమైన విజయ చరిత్ర కూడా ఉందని రాష్ట్రపతి గుర్తు చేయడం విశేషం. 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో విశాఖ తూర్పు నావికాదళం చేసిన పోరాటం నిరుపమానం అన్నారు. నాడు పాకిస్థాన్ని ఓడించి ఘన విజయం సాధించిన వైనాన్ని రామ్ నాధ్ కోవింద్ చెప్పుకొచ్చారు.

మొత్తానికి ప్రపంచానికి వైజాగ్ గా చిరపరిచయం అయిన విశాఖ గురించి రాష్ట్రపతి తన నోట చెప్పడం, అందాల నగరం అని కొనియాడడంతో విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖలో జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా విశాఖ అంతా యుద్ధ వాతావరణమే కనిపించింది.

పైన గగన తలంలో యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతూంటే విశాఖ సాగరం తీరంలో పదుల సంఖ్యలో యుద్ధ నౌకలు కనువిందు చేశారు. ఇంకో వైపు హెలికాప్టర్లు, అలగే సబ్ మెరైన్లు మొత్తానికి మొత్తం నావికాదళం ఆయుధ సంపత్తిని చూసి విశాఖ పులకించింది. మేరా భారత్ మహాన్ అని గర్వించింది.