Begin typing your search above and press return to search.
కరోనానే సమకాలీన అంశం.. రాష్ట్రపతి గణతంత్ర సందేశం... ఇదే.. ఏమన్నారంటే!
By: Tupaki Desk | 25 Jan 2022 4:09 PM GMT73వ గణతంత్ర దినోత్సవం(బుధవారం) సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. సాధారణంగా.. ఈ సందర్భంగా సమకాలీన అంశాలను రాష్ట్రపతి ప్రస్తావిస్తారు. అయితే.. ఈ సారి.. గత ఏడాది కూడా కరోనానే సమకాలీన అంశంగా మారింది. దీంతో ఈ విషయంపైనే రాష్ట్రపతి ఫోకస్ చేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా పై పోరులో దేశం అసాధారణ ప్రతిభ చూపుతోందన్నారు.
``మన ప్రజాస్వామ్య వైవిధ్యం, చైతన్యం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఐక్యత, ఒకే దేశం అనే స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏటా గణతంత్ర దినోత్సవం జరుపుకొంటాం. మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నప్ప టికీ.. స్ఫూర్తి మాత్రం ఎప్పటిలాగే దృఢంగా ఉంది. ఈ సందర్భంగా స్వరాజ్యం కల సాధనలో సాటిలేని ధైర్యాన్ని ప్రదర్శించి, దాని కోసం పోరాడేందుకు ప్రజలను మేల్కొలిపిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుందాం. రెండేళ్లయినా కరోనాతో పోరాటం ఇంకా అంతం కాలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి`` అని రామ్‌నాథ్ సూచించారు.
``అదృశ్య శక్తితో పోరాటంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. వైరస్పై పోరులో దేశం అసాధారణ ప్రతిభ చూపుతోంది. ఇతర దేశాలకు కూడా భారత్ సాయం చేసింది. కరోనాకు రెండు టీకాలు రూపొందించడం దేశానికి గర్వకారణం. మన దేశంలో తయారైన టీకాలను ఇతర దేశాలకూ అందించాం. కఠిన సమయంలోనూ దేశ ప్రజలు పోరాటస్ఫూర్తి చాటారు. కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. కరోనా సమయంలోనూ సాగు, తయారీ రంగంలో ప్రగతి సాధించాం. యువ మానవ వనరులు మన దేశానికి అనుకూలమైన అంశం. మన యువత స్టార్టప్‌లతో అద్భుతాలు సృష్టిస్తోంది. మన యువకుల విజయగాథలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.`` అని చెప్పారు.