Begin typing your search above and press return to search.
అప్పుడు నో ఎంట్రీ..ఇప్పుడు పూర్ఱకుంభ స్వాగతం
By: Tupaki Desk | 19 May 2018 3:30 PM GMTమనిషికి హోదాను మించిన శక్తి లేదంటారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విషయంలోనూ అదే జరిగింది. ఏడాది కిందట ఆయన వెళ్తే కాదన్నవారే ఇప్పుడు ఎదురొచ్చి స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు నో అన్నవారే ఇప్పుడు ఎర్రతివాచీలు పరుస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసా..?
గత ఏడాది జూన్ లో రామ్ నాథ్ కోవింద్ తన కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్ ప్రదేశ్ లోని ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ మశోబ్రాను సందర్శించాలనుకోగా, ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. అప్పటికి ఆయన రాష్ట్రపతి కాదు.. బిహార్ గవర్నరుగా ఉన్నారు. దీంతో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అనుమతి లేదని చెబుతూ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కోవింద్ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
కానీ.. ఇప్పుడు ఆయన అదే ప్రెసిడెన్సియల్ ఎస్టేట్ కు ప్రెసిడెంట్ హోదాలో వెళ్తున్నారు. ఎల్లుండి అక్కడకు వెళ్తున్న కోవింద్ కి అక్కడి సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి సత్కారాలు చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మశ్రోబా ఎస్టేట్ ను 1850లో నిర్మించగా, అది రాష్ట్రపతి కార్యాలయ అధీనంలో ఉంటోంది. హైదరాబాద్ శివారులోని బొల్లారంలో రాష్ట్రపతి విడిది ఎస్టేట్ ఉంది. దాని తరువాత మశోబ్రాలో మరో ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ ఉంది.