Begin typing your search above and press return to search.

ట్రంప్ భ‌విష‌త్తును తేల్చేసిన ఒబామా

By:  Tupaki Desk   |   15 March 2016 9:52 AM GMT
ట్రంప్ భ‌విష‌త్తును తేల్చేసిన ఒబామా
X
ప్ర‌పంచ పెద్ద‌న ప‌ద‌విని చేప‌ట్టాల‌ని క‌ల‌లు కంటున్న రిప‌బ్లికన్ పార్టీకి చెందిన డోనాల్డ్ ట్రంప్ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై అమెరికా అధ్య‌క్ష స్థానంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న బ‌రాక్ ఒబామా తేల్చేశారు. నిత్యం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ మీడియాలో నానే ట్రంప్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా త‌న మాట‌ల‌తో క‌ల‌క‌లం రేపుతున్నారు. అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి ఎంపిక‌య్యే వ్య‌క్తి దూర‌దృష్టితో ఉండ‌టంతోపాటు.. ఓర్పు.. స‌హ‌నం లాంటివి త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిన అంశాలు.

కానీ.. అలాంటివేమీ లేకుండా నిత్యం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్న ఆయ‌న వైఖ‌రిపై సొంత పార్టీ నేత‌లే త‌ప్పు ప‌డుతున్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డోనాల్ట్ ట్రంప్‌ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూ అధికార ప్ర‌క‌ట‌న‌ను వైట్ హౌస్ ద్వారా విడుద‌ల చేయ‌టం గ‌మ‌నార్హం. త‌న అనంత‌రం దేశాధ్య‌క్షుడిగా వ్య‌వ‌మ‌రించే వ్య‌క్తిగా డోనాల్డ్ ట్రంప్ ను అధ్య‌క్షుడిగా అమెరికా ప్ర‌జ‌లుఎన్నుకుంటార‌ని తాను అనుకోవ‌టం లేద‌ని ఒబామా వ్యాఖ్యానించ‌టం విశేషం.

ట్రంప్ కార‌ణంగా వివిధ దేశాల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను అమెరికాలోని ప్ర‌తి పౌరుడు గ‌మ‌నిస్తున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న వెల్ల‌డించింది. దీర్ఘ‌దృష్టి.. తెలివైన వ్య‌క్తి.. ఓర్పు.. స‌హ‌నం లాంటి గుణాలు ఉన్న‌వారినే అమెరికా అధ్య‌క్షుడిగా ప్ర‌జ‌లు ఎన్నుకుంటార‌ని ఒబామా వ్యాఖ్యానించారు. ట్రంప్ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఒబామా జోస్యం ఎంత‌వ‌ర‌కు నిజమ‌వుతుందో చూడాలి.