Begin typing your search above and press return to search.
రాష్ట్రపతి ప్రమాణానికి ప్రోసీజర్ చాలానే ఉంది
By: Tupaki Desk | 25 July 2017 6:13 AM GMTమరికొద్ది గంటల్లో రాష్ట్రపతి పీఠం మీద మరొకరు కూర్చోనున్నారు. దేశ చరిత్రలో రెండోసారి దళిత వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రధమ పౌరుడు కానున్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారోత్సవం ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 12.15 గంటలకు జరగనుంది. దేశ ప్రథమ పౌరుడి బాధ్యతలు స్వీకరించే ఈ కార్యక్రమానికి ప్రోసీజర్ చాలానే ఉంటుంది.
ప్రమాణస్వీకారోత్సవానికి ముందు ఆ తర్వాత కూడా చాలానే ఉంటుంది. సంప్రదాయాల్ని పాటిస్తూ సాగే ఈ కార్యక్రమం ఆసక్తికరంగా ఉంటుందని చెప్పక తప్పదు. తన ప్రమాణస్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందే ఆయన రాష్ట్రపతి కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రమాణస్వీకారోత్సవానికి ముందు.. ఆ తర్వాత జరిగే ప్రక్రియను చూస్తే..
1. ప్రమాణస్వీకారం చేయాల్సి కోవింద్.. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ముందే రాష్ట్రపతి భవన్ ముందు భాగానికి చేరుకుంటారు. ఆయన వెంట రాష్ట్రపతి సైనిక కార్యదర్శి ఉంటారు.
2. అశ్వారూఢులైన రాష్ట్రపతి అంగరక్షకులు లాంఛన దుస్తుల్లో ఠీవీగా వెంట వస్తారు.
3. ఆ తర్వాత ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్.. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్న కోవింద్ లు ఒకే కారులో పార్లమెంటు భవనానికి బయలుదేరుతారు.
4. వీరిద్దరూ పార్లమెంటు వద్దకు చేరుకునే సమయానికి వారికి స్వాగతం పలికేందుకు స్పీకర్.. ఉప రాష్ట్రపతి సిద్ధంగా ఉంటారు.
5. వీరిని సాదరంగా స్వాగతం పలికి పార్లమెంటు సెంట్రల్ హాల్ కు తీసుకెళతారు.
6. అనంతరం జాతీయ గీతాలాపన జరుగుతుంది. ఆ తర్వాత ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం షురూ అవుతుంది.
7. హోంశాఖ కార్యదర్శి వచ్చి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన లాంఛనాల్ని చదివి వినిపిస్తారు.
8. భారత ప్రధాన న్యాయమూర్తి కోవింద్ చేత రాష్ట్రపతి పదవిని చేపట్టేలా ప్రమాణస్వీకారం చేయిస్తారు.
9. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే 21 శతఘ్నుల్ని పేల్చి గౌరవ వందనం సమర్పిస్తారు.
10. కొత్తగా రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారోత్సవం చేసిన కోవింద్ ను.. ప్రణబ్ తన కుర్చీలో కూర్చోబెడతారు.
11. అనంతరం సభను ఉద్దేశించి కొత్త రాష్ట్రపతి ప్రసంగిస్తారు.
12. ప్రసంగం ముగిసిన తర్వాత ప్రణబ్.. కోవింద్ ఇద్దరు రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరుతారు. ఈసారి కూడా వారిద్దరూ ఒకే కారులో కూర్చుంటారు కానీ.. కాకపోతే వారు కూర్చునే సీట్లు మారిపోతాయి.
13. రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నాక.. కొత్త రాష్ట్రపతికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పిస్తాయి.
14. రాష్ట్రపతి భవనం గురించి కోవింద్ కు ప్రణబ్ వివరిస్తారు.
15. ఆ తర్వాత ప్రణబ్ ను తీసుకొని కోవింద్ మాజీ రాష్ట్రపతి నివాసమైన 10, రాజాజీ మార్గ్ వద్ద దిగబెట్టేందుకు బయలుదేరుతారు.
16. ఈ సందర్భంగా రాష్ట్రపతి అధికారిక వాహనమైన లిమోసీన్ లో ప్రణబ్ ఆఖరి ప్రయాణం మొదలవుతుంది.
17. ప్రణబ్ దాను ఆయన అధికారిక నివాసం వద్ద విడిచి పెట్టిన తర్వాత కోవింద్ ఒక్కరే రాష్ట్రపతి భవన్ కు బయలుదేరుతారు. అక్కడితే రాష్ట్రపతి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం లాంఛనంగా పూర్తి అవుతుంది.