Begin typing your search above and press return to search.
నన్ను చంపడమే.. రష్యా లక్ష్యం.. మీరేం చేస్తున్నారు? ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన
By: Tupaki Desk | 25 Feb 2022 3:21 PM GMTఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు రష్యా సేనలు దూసుకెళ్తున్నాయి. ఏ క్షణంలోనైనా నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. మరోవైపు రష్యా మొదటి గురి తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఆ దేశం దాడులు ఆపేంతవరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
``నన్ను చంపడమే రష్యా లక్ష్యం. నేను చావను. కానీ, దేశాన్ని మాత్రం రక్షిస్తా. ఒకవేళ చావే వస్తే.. అది దేశ రక్షణలోనే జరుగుతుంది. నేను మాత్రం ఉక్రెయిన్‌ను విడిచి వళ్లేది లేదు`` అని తేల్చి చెప్పారు. ఇదేసమయంలో ఆయన నాటో సభ్య దేశాలు ఏం చేస్తున్నాయని.. నిలదీశారు.
రష్యా మొదటి గురి తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. రష్యా తక్షణమే ఆక్రమణలు ఆపి.. చర్చలకు రావాలని కోరారు. దాడులు ఆపేంతవరకు మేం పోరాడుతూనే ఉంటామని చెప్పారు.
రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించామని, కానీ అలాంటిది ఏమీ జరగలేదని వాపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో తాము ఒంటరిగా మిగిలామని అన్నారు.
సైనిక లక్ష్యాలపై మాత్రమే దాడి చేస్తున్నామని రష్యా చెబుతున్నా.. పౌరులపైనా దాడులు జరుగుతన్నాయని తెలిపారు. తాను రాజధాని విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఎంతటి క్లిష్ట పరిస్థితులలోనైనా తాను ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు.
``నేను రాజధాని కీవ్‌ను విడిచిపెట్టినట్లుగా అనేక నకిలీ వార్తలు వస్తున్నాయని నాకు తెలుసు. అలాంటిదేమీ లేదు. నేను నా దేశ ప్రజలతో కలిసి రాజధానిలోనే ఉన్నాను. నేను మా భాగస్వామ దేశాలన్నింటినీ అడుగుతున్నాను.
మీరు ఉక్రెయిన్‌తో ఉన్నారా? లేరా? ఒకవేళ ఉన్నాం అనే సమాధానమిస్తే మమ్మల్ని నాటో కూటమిలోకి తీసుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరు. మా దేశ భద్రత హామీల గురించి మాట్లాడేందుకు మేము భయపడం. మా దేశ రక్షణ మాటేమిటి? ఆ హామీని ఏ దేశాలు మాకు అందిస్తాయి అనేదే చూస్తున్నాం.`` అని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా దూకుడుగా మున్ముందుకు వెళ్తోంది. దేశ సరిహద్దులు దాటి ఉక్రెయిన్ భూభాగంలోకి ప్రవేశించిన రష్యా బలగాలు ఇప్పటికే రాజధాని కీవ్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ కర్మగారాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం రష్యా సేనలు కీవ్ నగరానికి కేవలం 20 మైళ్ల(32 కిలోమీటర్లు) దూరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
రష్యా ప్రధానంగా కీవ్ నగరంపైనే గురి పెట్టిందని, అందుకు తగ్గట్లుగానే నలువైపుల నుంచి నగరం వైపునకు దూసుకొస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఏ క్షణమైనా రాజధానిని హస్తగతం చేసుకుని ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రమాదం ఉందని తెలిపాయి.