Begin typing your search above and press return to search.

చర్చలకు నేను సిద్ధం.. విఫలం అయితే యుద్ధం: జెలెన్ స్కీ

By:  Tupaki Desk   |   22 March 2022 3:30 AM GMT
చర్చలకు నేను సిద్ధం.. విఫలం అయితే యుద్ధం: జెలెన్ స్కీ
X
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం నేటికి 26 రోజుకు చేరుకుంది. పరిస్థితిలో ఎలాంటి మార్పులు లేవు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఇప్పటికే చాలా విధ్వంసం జరిగింది. అటు రష్యా ఎక్కడా తగ్గడం లేదు.

అదే విధంగా పుతిన్ సేనలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అనేక నగరాల్లో ప్రజలు బాంబు దాడులు క్షిపణి దాడులు చేస్తుంది రష్యా. దీంతో బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు ఉక్రెయిన్ లో ఉండేవారు.

పుతిన్ నిర్ణయంతో జరిగిన ఈ విధ్వంసంలో ఇప్పటి వరకు ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు నేల మట్టం అయ్యాయి. మరో వైపు ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. రష్యా సైనిక చర్య ప్రారంభించిన నాటి నుంచి చాలా మంది ప్రజలు వివిధ సరిహద్దు దేశాలకు తరలి వెళ్లారు.

ఒకరు కాదు ఇద్దరు కాదు.. కొన్ని లక్షల మంది ప్రజలు సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో తల దాచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కూడా ప్రజలపై దాడులు చేస్తుంది రష్యా. ఉక్రెయిన్ లో ఉండే శరణార్థులు ఉంటే ప్రాంతాలను వెతికి మరీ బాంబు దాడులకు దిగింది.

ఉక్రెయిన్ ను నిరాయుధ దేశంగా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది రష్యా. అందుకు గానూ ఇటీవల ఉక్రెయిన్ల ఆయుధాలు ఉండే భూమి అంతర్భాగాన్ని క్షిపణి తో పేల్చి వేసింది. మరో వైపు ఉక్రెయిన్ కు ఆయుధాలను అందించేందుకు అమెరికా సహా నాటో దేశాలు అన్ని ముందుకు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ప్రకటించినవే గాక ఇంకా కావాలంటే ఆయుధ సాయాన్ని ప్రకటిస్తున్నాయి. అయితే పశ్చిమ దేశాలు అందిస్తున్న చేయూతను అందిపుచ్చుకుంటుంది ఉక్రెయిన్. మరో వైపు రష్యాతో చర్చలకు కూడా సిద్ధ పడుతుంది. యుద్ధాన్ని ఆపేందుకు ముందుకు వస్తుంది.

చర్చలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. పుతిన్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఎన్ని విడతలుగా అయితే శాంతి చర్చలు జరిపేందుకు తాము రెడీ అని అన్నారు. కానీ ఇందుకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ముందుకు రావడం లేదని అంటున్నారు.

ఇదిలా ఉంటే చర్చలు కానీ విఫలం అయితే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి బాటలు వేస్తుందని అన్నారు. ఇప్పటికే మాస్కో సైనిక చర్య చేపట్టి నెల రోజులు పూర్తి కావొస్తుందని గుర్తు చేశారు. క్రమంలోనే రష్యా చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. మరో వైపు శాంతి చర్చలకు పుతిన్ నుంచి తాము ఆశించిన విధంగా సానుకూల ప్రకటన రావడం లేదని చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో తీసుకునే నిర్ణయాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని అభిప్రాయపడ్డారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు జెలెన్ స్కీ. శాంతి చర్చలు లేకుండా యుద్ధం ఆగదనే దాన్ని తాను నమ్ముతాను అందుకే రెండేళ్లుగా చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ పుతిన్ నుంచి తమకు ఎలాంటి సానుకూల స్పందన లేదని అన్నారు. ఇదే పరిస్థితితులు కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పనిసరి అని వెల్లడించారు.

ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వాఖ్యలు చేశార జెలెన్ స్కీ. ఒకవైపు ఉక్రెయిన్ బాంబులతో దద్దరిల్లుతుంటే దాని సమీపంలో ఉండే పోలాండ్ లో పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సిద్ధం అయ్యారు. ఈ నెల 25న పోలాండ్ లో పర్యటించనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.