Begin typing your search above and press return to search.

అవును.. నెల‌కు రూ.5.6ల‌క్ష‌ల ఫోన్ బిల్లు

By:  Tupaki Desk   |   20 July 2015 9:11 AM GMT
అవును.. నెల‌కు రూ.5.6ల‌క్ష‌ల ఫోన్ బిల్లు
X
అస‌మాన్య స్థానాల్లో ఉన్న వారి ఖ‌ర్చులు ఎంత భారీగా ఉంటాయో తాజాగా బ‌య‌ట‌కొచ్చింది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా రాష్ట్రప‌తి భ‌వ‌న్ నెల‌స‌రి ఫోన్ బిల్లు ఎంత‌? అన్న సందేహం ఒక‌రికి వ‌చ్చింది. ఆల‌స్యం చేయ‌కుండా స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం ద్వారా త‌న మ‌న‌సులోని సందేహాన్ని సంధించారు.

ఆ వ‌చ్చిన స‌మాధానం చూసి బిత్త‌ర పోవ‌టం స‌ద‌రు స‌మాచార హ‌క్కు ద‌ర‌ఖాస్తుదారుడి వంతైంది. ముంబ‌యికి చెందిన మ‌న్సూర్ వేసిన ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన రాష్ట్రప‌తి భ‌వ‌న్‌.. ఏప్రిల్ నెల ఫోన్ బిల్లు రూ.5.6ల‌క్ష‌లని పేర్కొంది. మార్చిలో ఈ ఫోన్ బిల్లు రూ.4.25ల‌క్ష‌లుగా పేర్కొంది. అంతేకాదు..రాష్ట్రప‌తి భ‌వ‌న్ వార్షిక బ‌డ్జెట్ వివ‌రాలు కూడా ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

2012-13 వార్షిక బ‌డ్జెట్ లో రూ.30.96కోట్లు కేటాయించ‌గా.. 2013-14కు దీన్ని రూ.41.96కోట్లుగా పెంచారు. రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో మొత్తం 754 మంది ఉద్యోగులు ఉంటార‌ని.. తొమ్మిది మంది సెక్యూరిటీ గార్డులు.. 27 మంది డ్రైవ‌ర్లు.. 64 మంది స‌ఫాయి కార్మికులు ప‌ని చేస్తుంటారు. మొత్తానికి దేశ ప్ర‌ధ‌మ పౌరుడు నివ‌సించే భ‌వ‌నం ఖ‌ర్చులు ఓ రేంజ్ లో ఉంటాయ‌న్న మాట‌.