Begin typing your search above and press return to search.
సావగొట్టొద్దు సామీ.. రాష్ట్రపతి చిరాకు
By: Tupaki Desk | 25 Dec 2016 6:59 AM GMTఆర్డినెన్సుల రూపంలో చట్టాలు చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఆయన వ్యవహరిస్తున్నప్పటికీ అత్యవసరాలను మితిమీరి వినియోగిస్తున్నారని ఆయన మండిపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఒకే ఆర్డినెన్సును సవరణల పేరుతో అయిదుసార్లు రాష్ట్రపతికి పంపించడంతో ఆయన వివరణ కూడా కోరారట.
శత్రు ఆస్తుల (సవరణ - చెల్లుబాటు) అయిదవ ఆర్డినెన్స్ - 2016పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఆయన దానిపై సంతకం చేయడం అది అయిదోసారట. దీంతో ఆయన పదే పదే ఒక ఆర్డినెన్స్ ను జారీ చేయడం సరైనది కాదని పేర్కొంటూ అలా ఎందుకు జరిగిందో చెప్పాలంటూ లోక్ సభ సెక్రటేరియట్ ను వివరణ కోరారట.
దీనితోపాటుగా పార్లమెంట్ లో పతిపక్షాల ఆందోళనల మద్య పన్ను చట్టాల (రెండవ సవరణ) బిల్లు - 2016 ఆమోదం పొందిన తీరుకు కారణా లను కూడా రాష్ట్రపతి కోరారు. మరోవైపు నిర్దిష్టమైన పరిశ్రమలు తమ ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా లేదా చెక్కుల రూపంలో వేతనాలు చెల్లించడానికి వీలుగా వేతన చెల్లింపుల చట్టం - 1936లో సవరణలకోసం ఆర్డినెన్స్ జారీ చెయ్యాలని మంత్రి వర్గం నిర్ణయించుకున్నట్టు బుధవారం రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోడీ వివరించారు. ఈ ఆర్డినెన్స్ మీద కూడా గురువారం హైదరాబాద్ వెళ్ళకముందే రాష్ట్రపతి సంతకం చేశారు. అయితే, మోడీతో సమావేశమైనప్పుడు కానీ, అంతకుముందు రోజు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కలిసినప్పుడు కానీ శత్రు ఆస్తుల ఆర్డినెన్స్ గురించి రాష్ట్రపతితో ప్రస్తావించారా లేదా అన్నది తెలియాల్సి ఉంటి. కాగా గతంలో ఏ ఆర్డినెన్స్ అయిదు సార్లు జారీ కాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/