Begin typing your search above and press return to search.

భార‌త్‌ లో ఇక‌పై ఆ మాట ప‌లికితే నేర‌మే

By:  Tupaki Desk   |   1 Aug 2019 11:49 AM GMT
భార‌త్‌ లో ఇక‌పై ఆ మాట ప‌లికితే నేర‌మే
X
కొన్ని దశాబ్దాలుగా భారతదేశ ముస్లింలలో ఓ విడాకుల‌ ఆచారంగా పాతుకుపోయిన ఓ పదానికి నేటితో చట్టం రూపంలో తెరపడిపోయింది. ముస్లిం సమాజంలో అమల్లో ఉన్న సత్వర విడాకుల ఆచారం త్రిపుల్ తలాక్ ఇకనుంచి తెర‌మ‌రుగు కానుంది. మనదేశంలో ఏ ముస్లిం అయినా తలాక్‌ అనే మాట ప‌లికితే అది నేరం అవుతుంది. అక్కడ పరిస్థితి తీవ్రతను బట్టి ఈ ప‌దం ప‌లికినుందుకు శిక్షలు కూడా అమల్లో ఉంటాయి. కొద్ది రోజుల క్రితం లోక్‌ స‌భలోనూ... రెండు రోజుల క్రితం రాజ్యసభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ గురువారం ఆమోదం తెలిపారు.

రాష్ట్ర‌ప‌తి ఆమోద‌ముద్ర‌తో ఈ బిల్లు చట్టరూపం దాల్చిందని ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత ఫిబ్రవరిలో జారిచేసిన ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌ స్థానంలో ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం-2019 అమల్లోకి వచ్చింది. ట్రిఫుల్ త‌లాక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింల మత నియ‌మానికి సంబంధించి కొన్ని శతాబ్దాలుగా పాతుకుపోయింది. ఈ సంప్ర‌దాయంపై ఆధునిక సమాజంలో కొన్ని విమర్శలు తలెత్తడంతో కొన్ని దేశాలలో ఈ తలాక్ విడాకులను నిషేధించారు. ఇక నరేంద్ర మోడీ తొలిసారి ప్రధానమంత్రి అయినప్పుడు దీనిని నిషేధించాలని లోక్‌ స‌భలో బిల్లు ప్ర‌వేశ‌పెట్టినా స‌క్సెస్ కాలేదు.

ఇక రెండోసారి ఆయన ప్రధాన మంత్రి అయ్యాక ఎలాగైనా తలాక్ నిషేధిస్తూ చట్టం తేవాలని బలంగా డిసైడ్ అవడంతో... ఈ బిల్లు లోక్‌ స‌భతో పాటు బిజెపికి అంతగా బలం లేని రాజ్యసభలో ఆమోదం పొందిది. రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందిన రెండు రోజుల‌కే ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా అమలులోకి వచ్చింది. ఇక‌పై ముస్లిం మహిళలకు తమ భర్తలు వెనువెంటనే విడాకులు ఇచ్చేవిధానం ఇకపై నేరం కానుంది.

రాత‌పూర్వ‌కంగా లేదా నోటి మాట ద్వారా లేదా మెసేజ్ రూపంలో తలాక్ అని మూడుసార్లు చెప్పి విడాకులు ఇవ్వ‌డం ఇక‌పై కుద‌ర‌దు. ఇలా చేయడం చట్టవిరుద్ధమని ఈ చట్టం పేర్కొంది. ఇలా చేసిన వారికి మూడేళ్ల జైలు శిక్ష‌తో పాటు జరిమానా కూడా విధించే అవకాశముంది.