Begin typing your search above and press return to search.
ట్రిపుల్ తలాక్ కు రాష్ట్రపతి ఆమోదం..
By: Tupaki Desk | 20 Sep 2018 8:32 AM GMT ఎన్నో వివాదాలు.. ఎన్నో అడ్డంకుల నడుమ కేంద్రం కేబినెట్ త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. తాజాగా గురువారం ఈ చారిత్రాత్మక ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసి ఆమోదం తెలిపారు. ఇది అమలులోకి రావడంతో ఇక నుంచి త్రిపుల్ తలాక్ చెబితే తీవ్రమైన నేరంగా.. నాన్ బెయిలబుల్ కేసుగా మారనుంది.
ఈ చట్టం కార్యరూపం దాల్చడంతో ఇక ముస్లిం మహిళలు తలాక్ సంప్రదాయం పేరుతో మోసపోవడానికి - దోపిడీకి గురికాకుండా అడ్డుకోవడానికి ఆస్కారం లభించింది. వారికి తక్షణ న్యాయం అందేలా ఈ కొత్త చట్టంలో నిబంధనలు రూపొందించారు. ఇప్పుడు ఎవరైనా తలాక్ బాధితులైన స్త్రీలు తమ భర్తలపై కేసులు నమోదు చేయడానికి ఈ చట్టం అనుకూలతనిచ్చింది. ఈ తలాక్ కేసు నమోదైతే బెయిల్ కూడా లభించని విధంగా చట్టంలో పొందుపరిచారు. దీనిపై ఓ మెజిస్ట్రేట్ మాత్రమే బెయిల్ ఇచ్చేలా కఠిన నిబంధనలను పొందుపరిచారు. అది కూడా భార్య వాదన విని.. ఆమెకు భర్త ఎంత పరిహారం ఇస్తాడనేది తేలిన తర్వాతే బెయిల్ ఇచ్చేలా చట్టాన్ని రూపొందించారు.
తలాక్ పేరుతో ముస్లిం మహిళలను వదులుకునే వారికి ఇక కఠిన శిక్షణలే విధిస్తారు. దోషులుగా తేలితే 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. భార్య అంగీకరిస్తే మాత్రమే భర్తను విడుదల చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ ఆర్డినెస్స్ లో ఇంత పకడ్బందీగా నిబంధనలు రూపొందించడంతో ముస్లిం మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ ఆర్డినెన్స్ ను అత్యవసరంగా బీజేపీ అమలు చేయడంపై కాంగ్రెస్ - ఎంఐఎం వంటి పార్టీలు మండిపడ్డాయి. రాబోయే మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - చత్తీస్ ఘడ్ - తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే బీజేపీ తలాక్ ఆర్డినెన్స్ ను అత్యవసరంగా ఆమోదించిందని విమర్శలు గుప్పించాయి.