Begin typing your search above and press return to search.

జీతం గురించి మాట్లాడిన రాష్ట్రపతి .. మిగిలేది 2 లక్షలేనట !

By:  Tupaki Desk   |   28 Jun 2021 10:30 AM GMT
జీతం గురించి మాట్లాడిన రాష్ట్రపతి .. మిగిలేది 2 లక్షలేనట !
X
భారతదేశం మొదటి పౌరుడు .. దేశ రాష్ట్రపతి కి ఉన్న ప్రత్యేక అధికారుల గురించి చెప్పాల్సిన పనేలేదు. దేశంలో దేనిగురించి మాట్లాడాలన్నా, ఏదైనా మార్పులు చేయాలన్న, చివరికి ఉరి శిక్ష పడ్డ ముద్దాయికి శిక్ష రద్దు చేసే అవకాశం ఒక్క రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అలాగే రాష్ట్రపతి గా అయన పదవి సమయం ముగిసిన తర్వాత కూడా రాష్ట్రపతి చివరి శ్వాస తీసుకునేవరకు వారికి ప్రత్యేక వసతులు, ఇంకా కొన్ని అవవెన్స్ లు కొనసాగుతాయి. అసలు ఈ సంగతి ఇప్పుడు దేనికి అంటే .. తాజాగా మన దేశ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ మాట్లాడుతూ తన జీతం పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు చర్చలకు దారితీస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే .. దేశంలో మంచి ఉన్నతమైన పదవుల్లో కొనసాగే వారి జీతం , వారికి ఉండే ప్రత్యేక వసతుల గురించి తెలుసుకోవాలని చాలామంది తహతహలాడుతుంటారు. అయితే తమ జీతాలు, సంపాదన గురించి వాళ్లు బహిరంగంగా మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్‌ కోవింద్‌ తన జీతం, కట్టింగ్‌ల గురించి మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అయన ఏం మాట్లాడారు అంటే .. దేశంలోనే అత్యధికంగా జీతం తీసుకుంటున్న వ్యక్తి నేను. నా నెల సంపాదన 5 లక్షలు. కానీ, అందులో 3 లక్షల దాకా ట్యాక్స్‌, కట్టింగ్‌ ల రూపంలో కట్ అవుతాయి. ఆ లెక్కన నాకు మిగిలేది తక్కువే. అంటే మిగిలినవాళ్ల కంటే నేనేం బెటర్‌ కాదు. ఒక టీచర్‌ నాకంటే ఎక్కువే సేవింగ్స్‌ చేస్తున్నాడు అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడారు.

అయితే , ప్రస్తుతం ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. రాష్ట్రపతి జీతంలో ట్యాక్స్‌ కట్టింగ్‌లు ఉండవని, ఆ విషయం తెలియక ఆయన అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొందరు ట్విటర్‌ ద్వారా సెటైర్లు కురిపిస్తున్నారు. అలాగే రాష్ట్రపతిగా రిటైర్‌ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్‌, ఇతరత్రా అలవెన్స్‌లు కూడా ఉంటాయని నెటిజన్స్ స్పందిస్తున్నారు. మరికొందరేమో రాజ్యాంగంలోని ప్రతులంటూ కొన్ని ఆధారాలను ట్విటర్‌ లో పోస్ట్‌ చేస్తున్నారు. పెన్షన్‌ యాక్ట్‌ 1951 ప్రకారం.. రాష్ట్రపతి జీతంపై పన్ను విధించరని చెప్తున్నారు. అయితే అదంతా ఉత్తదేనని, రాష్ట్రపతి జీతంలో కట్టింగ్‌ లు ఉంటాయని మరికొందరు చెప్తున్నారు. ఇంకా కొందరేమో స్పెషల్ ఫ్లైట్స్ , స్పెషల్ ట్రైన్స్ , లగ్జరీ హోటల్స్ లో తిరుగుతూ మళ్లీ జీతం , కేటింగ్స్ గురించి మాట్లాడటం ఏమిటి అని అంటున్నారు. ఈ వివాదం ఎటు నుంచి ఎటో వెళ్లి రాజకీయ దుమారానికి తెరలేపింది. మొత్తంగా ఎదో రాష్ట్రపతి గారు జీతం గురించి సరదాగా మాట్లాడితే నెటిజన్స్ దాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు. చూడాలి మరి ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో.