Begin typing your search above and press return to search.
ట్రంప్ తీరుతో ఆ మహిళా జర్నలిస్టుకు షాక్
By: Tupaki Desk | 28 Jun 2017 10:35 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం చేస్తారో అస్సలు అర్థం కాదు. తాజాగా అలాంటి పనే చేసి అందరి చేత చావు తిట్లు తింటున్నారు. తమ దేశాధ్యక్షుడు చేసిన పనికి అమెరికాన్లు అయితే సోషల్ మీడియాలో సారీ చెప్పేస్తున్నారు. ట్రంప్ తాజా తీరు పట్ల ఇప్పుడు పలువురు తప్పు పడుతున్నారు. ఒక మహిళా జర్నలిస్టు విషయంలో ట్రంప్ వ్యవహరించిన వైఖరి ఇప్పుడు సంచలనంగా మారింది.
ఐర్లాండ్ నూతన ప్రధానిగా వరద్కర్ ఎంపికయ్యారు. ఆయనకు అభినందనలు తెలిపేందుకు ట్రంప్ ఫోన్ చేశారు. అదే సమయంలో ఆయన ముందు పలువురు ఐరిష్ మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఓపక్క ఆ దేశ ప్రధానితో మాట్లాడుతూనే.. మరోవైపు ఐరీష్ మీడియా ప్రతినిధుల్లో ఉన్న ఒక మహిళా జర్నలిస్టును సైగ చేసి మరీ దగ్గరకు పిలిపించుకున్నారు.
ఓపక్క ఐర్లాండ్ ప్రధానితో మాట్లాడుతూనే.. సదరు మహిళా జర్నలిస్టుతో నీ నవ్వు బాగుందని కితాబు ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక సదరు మహిళా పాత్రికేయురాలు అలా నిలబడిపోయింది. అనంతరం ఆమె ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ.. ట్రంప్ చర్య వికృతంగా ఉందని పేర్కొంది. ఆమె ట్వీట్ కు పలువురు అమెరికన్లు మద్దతు పలకటమే కాదు.. తమ దేశ ప్రధాని చర్య పట్ల ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఇలాంటి చిత్ర విచిత్రమైన చేష్టలు ట్రంప్ మాత్రమే చేయగలరేమో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/