Begin typing your search above and press return to search.

ప్రెసిడెంట్ కోసం విశాఖ ముస్తాబు...వందకు పైగా పందుల హతం

By:  Tupaki Desk   |   5 Dec 2022 4:45 AM GMT
ప్రెసిడెంట్ కోసం విశాఖ ముస్తాబు...వందకు పైగా పందుల హతం
X
దేశ అధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన తరువాత తొలిసారిగా విశాఖపట్నం వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోసం విశాఖ అందంగా ముస్తాబు అయింది. ఈ ముస్తాబు వెనక రక్తపు మరకలు కూడా దాగి ఉన్న సంగతిని చూసిన జంతు ప్రేమికులు తీవ్ర అభ్యనతరం వ్యక్తం చేస్తున్నారు. విశాఖను అన్ని రకాలైన రంగులతో అలంకరించారు అని అంతా అనుకున్నారు కానీ రక్తం కూడా వాటితో రంగరించారని తెలుసుకున్న వారు షాక్ కి గురి అవుతున్నారు.

ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికేందుకు విశాఖను క్లీన్ గా నీట్ గా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ చిన్న ఇబ్బంది లేకుండా చూడాలని జీవీఎంసీని ఆదేశించింది. అంతే జీవీఎంసీ అధికారులు నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న పందుల మీద పడ్డారు. వాటిని హతమార్చి ఆ రక్తపు మరకలతోనే రాష్ట్రపతికి స్వాగతం ఘనంగా పలికారు అని అంటున్నారు.

విశాఖలో దాదాపుగా అయిదు వేల దాకా పందులు ఉంటాయి. దాంతో వాటిని సిటీ నుంచి దూరంగా తరలించాలని మొదట పందుల యజమానులకు చెప్పారు. అయితే కొంతమంది అంగీకరించారు. వేయి దాకా పందుల తరలింపు జరిగింది. మిగిలిన వారు ససేమిరా అనడంతో జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగి ప్రొఫెషనల్ షూటర్స్ ని పెట్టి మరీ పందులను షూట్ చేయడానికి తెగబడ్డారు అని అంటున్నారు.

దీని వల్ల ఏకంగా 184కి పైగా పందులు దారుణంగా చనిపోయాయని అంటున్నారు. మరి ఇది ఎంతవరకూ న్యాయమని జంత్రు ప్రేమికులు ఇపుడు ప్రశ్నిస్తున్నారు. కొన్ని గంటల పాటు దేశాక్ష్యకురాలి పర్యటన కోసం జంతువుల ప్రాణాలు తీయడం భావ్యమా అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే దీని మీద జీవీఎంసీ అధికారుల వాదన మరో విధంగా ఉంది.

కొన్ని పందులు అనారోగ్యంతో ఉండడం వల్ల వాటి ద్వారా ప్రజలకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని, అందువల్లనే వాటి విషయంలోనే కాల్పుల చర్యలకు దిగామని అంటున్నారు. మరి ఇందులో వాస్తవం లేదు అని జంతు ప్రేమికులు అంటున్నారు. ఎందువల్ల అంటే రాష్ట్రపతి విజిట్ చేసే సమయంలోనే ఇది జరిగింది. ఒకవేళ పందుల వల్ల వ్యాధులు వ్యాపిస్తాయనుకుంటే ఆ పని ముందో తరువాతో చేసేవారు కదా అని అంటున్నారు. అంటే తాము చేసిన పనిని కప్పిపుచ్చుకోవడానికే అధికారులు ఈ రకమైన మాటలు చెబుతున్నారు అని అంటున్నారు.

విశాఖ సిటీని శుభ్రంగా ఉంచాలీ అంటే వేరే విధమైన మార్గాలు ఉన్నాయని, జంతు బలులు ఇచ్చి మరీ స్వాగతాలు పలకాల్సిన అవసరం ఉందా అని కూడా నిలదీస్తున్నారు. మొత్తానికి ప్రెసిడెంట్ పర్యటన సాఫీగా విజయవంతంగా సాగినా ఈ వివాదం వెనక ఉన్న రక్తపు మరకలు ఆరని మంటలే రగిలిస్తున్నాయి. దీని మీద జీవీఎంసీ ఏ విధంగా జవాబు చెప్పి బయటపడుతుందో అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.