Begin typing your search above and press return to search.
అమెరికాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు.. తీవ్ర భావోద్వేగం.. ఏమన్నారంటే!
By: Tupaki Desk | 22 Dec 2022 3:30 PM GMTరష్యాతో ఎడతెగని పోరు సల్పుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో వాషింగ్టన్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో అమెరికా నుంచి వచ్చే ఆర్థిక, ఆయుధల సాయంపై ప్రధానంగా చర్చలు జరిపారు. రష్యాతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడుఅమెరికాలో పర్యటించడం.. ప్రాధాన్యం సంతరించుకుంది.
అదేవిధంగా అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి కీలక సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. ఇటీవలే అమెరికా ఉక్రెయిన్‌కు యుద్ధ సాయం కింద 2 బిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజీని ప్రకటించింది. అమెరికా ప్రకటించిన ప్యాకేజీలో పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ మౌలిక వసతులను కాపాడుకొనేందుకు దీనిని వినియోగించనున్నారు. 2023 నాటికి దాదాపు 40 బిలియన్ డాలర్లకు పైగా ఉక్రెయిన్‌కు అందించే బిల్లును అమెరికా సిద్ధం చేస్తోంది.
జెలెన్‌స్కీ ఏమన్నారంటే..
ఉక్రెయిన్‌కు అమెరికా అందజేసే నిధులు, ఆయుధాలు వంటివి విరాళం కాదని.. అది పెట్టుబడితో సమానమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. అమెరికా కాంగ్రెస్‌లో ఆయనప్రసంగిస్తూ.. "మీ డబ్బు విరాళం కాదు.. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యాలకు పెట్టుబడి. నేను ఇక్కడ ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చిన ఉక్రెయిన్ కుప్పకూలదు. సజీవంగానే ఉండి పోరాడుతుంది. ప్రపంచం దృష్టిలో మేము రష్యాను ఓడించాము. శాంతి కోసం మేము చేస్తున్న ప్రయత్నాలకు బైడెన్ సహకరించారు. ఆయనకు ధన్యవాదాలు. అమెరికా బలంగా.. సమష్టిగా ఉందని చెప్పేందుకు ప్రతి ఒక్క సభ్యుడు సహకరించాలి" అని జెలెన్‌స్కీ అభ్యర్థించారు.
బైడెన్ ఏం చెప్పారంటే..
జెలెన్‌స్కీ కాంగ్రెస్ సభలోకి అడుగు పెడుతున్న సమయంలో కొందరు సభ్యులు ఉక్రెయిన్ పతాకాల్ని ప్రదర్శించారు. జెలన్‌స్కీ తన పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా.. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ ఎప్పటికీ ఒంటరిది కాదని పేర్కొన్నారు.
జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బైడెన్ మాట్లాడుతూ.. మిత్రపక్షాలను కలిపి ఉంచడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొంత మంది మిత్రులు యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన, ఆహార కొరత కారణంగా ఇబ్బందికి గురివుతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో అందరూ సంఘీభావంతో ఉన్నారన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.