Begin typing your search above and press return to search.
రాష్ట్రపతి ఎన్నికలు: ఎలా సాగింది? ఎలా ముగిసిందంటే?
By: Tupaki Desk | 18 July 2022 1:40 PM GMTఓ వైపు అధికార ఎన్టీఏ, ప్రతిపక్ష యూపీఏ కూటమి హోరాహోరీగా తలపడ్డ రాష్ట్రపతి ఎన్నికల ఘట్టం ముగిసింది. పార్లమెంట్ లో ఎంపీలందరూ ఓటేయగా.. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటేశారు. సాయంత్రం 5 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకూ కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగించారు. ఎన్నికల ఫలితాలు 21న విడుదల కానున్నాయి. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఎన్డీఏ తరుఫున ద్రౌపది ముర్ము, యూపీఏ తరుఫున యశ్వంత్ సిన్హాలు రాష్ట్రతి రేసులో పోటీపడ్డారు. ప్రతిపక్షాల తరుఫున బలం తక్కువగా ఉన్నా కొన్ని పార్టీలు జారిపోవడంతో మైనస్ అయ్యింది. శివసేన, జేఎంఎం, జేడీఎస్ లాంటి ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటేయడంతో మైనస్ గా మారింది.
-ఏపీలో ఓటేసిన జగన్, ఓటేయని బాలయ్య
ఏపీలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం సహా చంద్రబాబు తదితరులు ఓటేశారు. మొత్తం 173మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.151మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేయడం విశేషం. టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరిలు ఈ ఎన్నికల్లో ఓటేయలేదు.
-తెలంగాణలో ఓటేసిన కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం, మంత్రులు ఓటేశారు. మొత్తం 119 ఎమ్మెల్యేలలో 117మంది ఓటేశారు. కరోనా బారిన పడడంతో మంత్రి గంగుల కమలాకర్ , జర్మనీలో ఉండడంతో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఏపీకి చెందిన కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీదర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేశారు. తెలంగాణలో మొదట ఓటేసింది మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ నుంచి ఒకేసారి ఎమ్మెల్యేలను తరలించేందుకు మూడు బస్సులను ఏర్పాటు చేశారు.
-పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతాలోని అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు ధర్మేంద్రప్రధాన్ సహా అందరూ పార్లమెంట్ లోనే ఓటేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ క్రికెటర్లు, ఎంపీలు హర్భజన్, గౌతం గంభీర్ లు పార్లమెంట్ లో ఓటేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఎంపీ శశిథరూర్, దిగ్విజయ్ సింగ్, మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఓటేశారు.
-ప్రతిపక్షాల తరుఫున యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపింది ఎన్సీపీ పార్టీ. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యే కంధాల్ ఎస్ జడేజా ఆ నియమాన్ని ధిక్కరించి బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీల్ చైర్ వచ్చిన మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.