Begin typing your search above and press return to search.
రాష్ట్రపతి ఎన్నికలు.. ఇంకా ఖరారు కాని ప్రతిపక్షాల అభ్యర్థి
By: Tupaki Desk | 16 Jun 2022 6:33 AM GMTజూలై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు. గాంధీజీ-సి.రాజగోపాలాచారిల మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ(77)ని బరిలోకి దించాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయా పార్టీలతో కలిసి నిర్ణయించారు. అలాగే జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను దించడంపైన విపక్షాలు చర్చించాయి.
జూన్ 15న ఢిల్లీలో సమావేశమైన 17 విపక్ష పార్టీలు శరద్ పవార్ అభ్యర్థిత్వానికి ఓకే చెప్పాయి. అయితే ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా దిగడానికి అంగీకరించలేదు. దీంతో విపక్షాలు గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లాలను దించడంపై చర్చలు సాగిస్తున్నాయి. జూన్ 15న ఇందుకు సంబంధించిన చర్చలు అంసపూర్తిగా మిగలడంతో వచ్చేవారం మరోసారి సమావేశమవ్వాలని పార్టీలు నిర్ణయించాయి.
కాగా బిజూ జనతాదళ్ (బీజేడీ), తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), శిరోమణి అకాలీదళ్, సిక్కిం డెమెక్రటిక్ ఫ్రంట్ సమావేశానికి హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించడంపై అభ్యంతరం పెట్టిన ఆ పార్టీలు సమావేశానికి డుమ్మా కొట్టాయి. సమావేశానికి హాజరైన ప్రతినిధులు రాష్ట్రపతి అభ్యర్థిపై దాదాపు గంటన్నర చర్చించారు. అయితే తొలి భేటీ ఫలప్రదం కాని నేపథ్యంలో జూన్ 20న కానీ 21న కానీ మరోసారి సమావేశం కానున్నారు.
కాగా గోపాలకృష్ణ గాంధీ తాను ఆలోచించుకోవడానికి సమయం కావాలని కోరారు. అప్పుడే ఈ విషయంపై స్పందించడం తొందరపాటు అవుతుందన్నారు. దక్షిణాఫ్రికా, శ్రీలంకలతోపాటు పలు దేశాల్లో భారత రాయబారిగా పనిచేశారు. 2017లో ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి.
అయితే ఆ ఎన్నికల్లో వెంకయ్యనాయుడిపై పోటీచేసి గోపాలకృష్ణగాంధీ ఓడిపోయారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పోటీకి ఆయన అంగీకరిస్తే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆయననే తమ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నిలుపుతాయని తెలుస్తోంది.
మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ ని రంగంలోకి దించాలని ప్రతిపక్ష పార్టీలు అనుకున్నప్పటికీ ఆయన అంగీకరించలేదని చెబుతున్నారు. శరద్ పవార్ ని ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించడానికి అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నాయి. అయితే ఇంకా ప్రధానమంత్రి పదవిపైన శరద్ పవార్ కు ఆశ చావలేదని.. ఎప్పటికైనా ప్రధానమంత్రి కావాలని ఆయన కలలు కంటున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత ప్రదర్శిస్తున్నారని పేర్కొంటున్నారు.