Begin typing your search above and press return to search.
బలం ఏకపక్షం.. రాష్ట్రపతి ఎన్నిక సాంకేతికమే
By: Tupaki Desk | 23 Jun 2017 6:53 AM GMTరాష్ట్రపతి ఎన్నిక పక్కా అని తేలిపోయింది. అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిపై విపక్షాలు అభ్యర్థిని బరిలో నిలపనున్నట్లుగా వెల్లడించటం తెలిసిందే. విజయం అధికారపక్షమన్న విషయంపై స్పష్టత ఉన్నప్పటికీ.. పోటీ మాత్రం సాంకేతికంగా మారింది. అధికారపక్ష వైఖరిని తప్పు పడుతూ విపక్షాలు సైతం రాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థిని రంగంలోకి దించారు.
అందరిని కలుపుకు వెళతానంటూనే తనదైన రాజకీయ లబ్థి కోసం ప్రధాని మోడీ వ్యవహరించిన తీరును విపక్షాలు తప్పు పడుతున్నాయి. ఏకాభిప్రాయ సాధన కోసం అధికార పార్టీ ప్రయత్నాలు చేసినట్లుగా కనిపించినప్పటికీ.. ఆ పని నిజాయితీగా జరగలేదన్నది విపక్షాల వాదన. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించేది ఎవరన్న విషయాన్ని బీజేపీ నేతలు చెప్పకుండానే మద్దతు కోరినట్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో.. అధికార పక్షానికి వ్యతిరేకంగా అభ్యర్థిని పోటీకి నిలపాలని నిర్ణయించారు.
ఎన్డీయే పక్ష రాష్ట్రపతి అభ్యర్థిగా రాజ్ నాథ్ కోవింద్ బరిలోకి నిలిస్తే.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ను బరిలోని దింపనున్నట్లుగా కాంగ్రెస్ సహా విపక్షాల నేతల బృందం ప్రకటించింది. దీంతో.. అత్యున్నత పదవికి పోటీ తప్పనిసరైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాజా ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేదని చెప్పాలి. ఎందుకంటే.. అధికార ఎన్డీయే పక్షానికి.. వారికి మద్దతుగా నిలుస్తానని వెల్లడించిన పార్టీల నేపథ్యంలో పోటీ అన్నది లేదని చెప్పాలి.
రాష్ట్రపతి ఎన్నికల్లో పరిగణలోకి తీసుకునే ఎలక్ట్రోరల్ కాలేజీలో మొత్తం ఓట్లు 10,98,903 ఓట్లు కాగా ఇందులో సగం కన్నా ఒక్క ఓటు ఎక్కువ సాధిస్తే విజయం సాధించినట్లే. ఈ లెక్కన చూసినప్పుడు యూపీఏ బలంతో పోలిస్తే.. అధికార ఎన్డీయే.. వారికి అండగా నిలుస్తామని మాట ఇస్తున్న కొన్ని పార్టీల ఓట్లతో చూస్తే.. కోవింద్ విజయం నూటికి రెండు వందల శాతం నిజం కానుంది.
బలాబలాల విషయానికి వస్తే.. ఎన్డీయే కూటమి ఓట్ల విలువ చూస్తే 5,37,683 ఓట్లు. అదే ఓట్ల శాతంతో చూస్తే.. అది 48.64 శాతంగా చెప్పాలి. ఇందులో ఒక్క బీజేపీ ఓట్ల విలువను శాతంలో చూస్తే 40.03 శాతం కావటం గమనార్హం. ఎన్డీయే కూటమిలో ఓ మోస్తరు ఓట్ల శాతం ఉన్న పార్టీలు రెండే రెండు. అందులో టీడీపీ ముందు ఉంటే.. రెండో స్థానంలో శివసేన నిలుస్తుంది. ఈ రెండు పార్టీల ఉమ్మడి ఓట్ల విలువ శాతం 5.5 శాతానికి మించని పరిస్థితి. మిగిలిన అన్నీ పార్టీల ఓట్ల శాతం మూడున్నర శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
అదే సమయంలో బీజేపీ.. కాంగ్రెస్‌లకు సమాన దూరాన్ని మొయింటైన్ చేస్తూ.. తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతుగా నిలిచే పార్టీల ఓట్ల శాతాన్ని చూస్తే.. అన్నాడీఎంకే రెండు వర్గాలు 5.36 శాతం.. టీఆర్ఎస్ ది 1.99 శాతం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది 1.53 శాతం.. మొత్తంగా చూస్తే ఎన్డీయేకి ఉన్న బలం.. తటస్థుల బలం చూసినప్పుడు వీరి అభ్యర్థిని బలపరిచే ఓట్ల శాతం ఏకంగా 62.39 శాతంగా ఉంది. ఇక.. యూపీఏ పక్షానికి ఉన్న బలం చూస్తే.. 33.58 శాతమే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక కేవలం నామమాత్రమే తప్పించి మరెలాంటి ప్రయోజనం ఉండదని చెప్పకతప్పదు. విజయం కన్ఫర్మ్ అయినా తప్పనిసరిగా ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితిగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/