Begin typing your search above and press return to search.

జగన్ జీవో మీద వివరణ కోరిన ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా

By:  Tupaki Desk   |   2 Nov 2019 12:27 PM GMT
జగన్ జీవో మీద వివరణ కోరిన ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా
X
సోషల్ మీడియా ..ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిన క్షణాల వ్యవధిలో ఆ విషయాలు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాని రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలందరికీ దగ్గర కావడానికి ఈ సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది.కానీ. ఈ సోషల్ మీడియా లో వచ్చేది ప్రతిదీ నిజమే అని కూడా నమ్మలేము. ఎందుకు అంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. ఎవరైనా తమకి ఇష్టం వచ్చినట్టు రాసుకొని పోస్ట్ చేసుకునే అవకాశం ఉండటంతో ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేస్తున్నారు. దీనితో కొన్ని సార్లు జరగనిది కూడా జరిగిందేమో అని అనుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి.

ఇక సర్కారు ప్రతిష్టను మంటగలపాలని, ప్రజల్లో చెడ్డపేరు తేవాలనే దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు కుట్రపూరితంగా పెద్దఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో గత నెల 30 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ని తీసుకువచ్చింది. ఎవరిపైనైనా సోషల్ మీడియా లో నిరాధారమైన వార్తలు రాసినా, ప్రసారం చేసినా కఠిన చర్యలు ఉండబోతున్నాయి అని జీవో ప్రకారం తెలుస్తుంది.

జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త జీవోని కొంతమంది సమర్దిస్తున్నా..ఎక్కువ శాతం మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవో తో మీడియా హక్కులని కాలరాయడానికి జగన్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది అని మండిపడుతున్నారు. అలాగే దీనిపై ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా కి ఫిర్యాదు కూడా చేసారు. తాజాగా దీనిపై ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా స్పందించింది. ఈ జీవో పై సమగ్ర వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ని ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా కోరింది.