Begin typing your search above and press return to search.

ఆంధ్రజ్యోతికి సర్వే షాక్.. పీసీఐ షోకాజ్ నోటీస్

By:  Tupaki Desk   |   11 April 2019 4:59 AM GMT
ఆంధ్రజ్యోతికి సర్వే షాక్.. పీసీఐ షోకాజ్ నోటీస్
X
ఆంధ్రజ్యోతి మీడియా సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆ మీడియా సంస్థ ప్రచురించిన ఒక సర్వే బోగస్ గా తేలటం.. ఏ సంస్థ పేరుతో సర్వే ఫలితాన్ని ప్రచురించారో.. ఆ సంస్థ తాము సర్వే చేయలేదంటూ ఖండించిన నేపథ్యంలో భారత ప్రెస్ కౌన్సిల్ షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఫేక్ న్యూస్ ప్రచురణపై 15 రోజుల్లోపు రాతపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

లోక్ నీతి - సీఎస్ డీఎస్ సంస్థలు నిర్వహించినట్లుగా ఒక బోగస్ సర్వేను ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ ప్రచురించిందన్న ఆరోపణలు ున్నాయి. ఈ సర్వేలో టీడీపీకి 126-135 అసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకోనున్నట్లుగా.. 18-22 ఎంపీ స్థానాల్ని గెలవనున్నట్లుగా సర్వే పేర్కొన్నట్లుగా ప్రకటించారు. అయితే.. ఏపీలో తాము ఎలాంటి సర్వేను నిర్వహించలేదని.. తమ సంస్థ పేరును దుర్వినియోగంచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని లోక్ నీతి - సీఎస్ డీఎస్ సంస్థ హెచచరించింది.

ఈ సర్వే వార్తపై భారత ఎన్నికల సంఘానికి.. ప్రెస్ కౌన్సిల్ ఇండియాకు సైతం పలువురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతికి షోకాజ్ నోటీసును ఇచ్చినట్లుగా చెబుతున్నారు. బోగస్ సర్వేలతో వార్తను ప్రచురించటాన్ని తాము పెయిడ్ న్యూస్ గా అనుమానిస్తున్నట్లుగా.. ఈ వార్త ప్రచురణకు ఆంధ్రజ్యోతి పత్రికపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సీనియర్ జర్నలిస్టు.. భారత ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యుడు కె. అమర్ నాథ్ కంప్లైంట్ లో పేర్కొన్నారు. మరి.. దీనికి ఆంధ్రజ్యోతి ఏమని బదులిస్తుందో చూడాలి.