Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌కు స‌మాధానం ఏదీ.. మోడీ స‌ర్‌కు పెరుగుతున్న బీపీ!!

By:  Tupaki Desk   |   19 Dec 2022 11:30 PM GMT
పాకిస్థాన్‌కు స‌మాధానం ఏదీ.. మోడీ స‌ర్‌కు పెరుగుతున్న బీపీ!!
X
ప్ర‌ధాని మోడీ అంటే.. అంత‌ర్జాతీయ స‌మాజం కూడా నెత్తిన పెట్టుకుందని బీజేపీ నేత‌లు చెబుతుంటారు. నిజ‌మే కావొచ్చు.. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అణు విధ్వంసాల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌న్న మోడీ సుద్దులు ప‌నిచేశాయ‌ని బీజేపీ నేత‌లు ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. ఇక‌, జీ-20 స‌ద‌స్సు నిర్వ‌హించే అవ‌కాశం కూడా గొప్ప‌గానే ద‌క్కింద‌ని మ‌రింత ప్ర‌చారం కాద‌నే వారు లేరు.

అయితే.. వాస్త‌వంలోకి వ‌చ్చేస‌రికి.. మోడీ సుద్దుల‌తో ర‌ష్యా వెన‌క్కి త‌గ్గ‌లేద‌ని తాజాగా వాషింగ్ట‌న్ పోస్ట్ కీల‌క క‌థ‌నం ప్ర‌సారం చేసింది. ఇప్ప‌టికే దూకుడుగా ఉన్న‌ర‌ష్యా ఇలాంటి అణు ప్ర‌యోగాల‌కు రెడీ అయితే.. అంత‌ర్జాతీయంగా ఒంట‌రి అవుతుంద‌నే భ‌యంతోనే వెన‌క్కి త‌గ్గింద‌ని చెప్పుకొచ్చింది. అయితే.. దీనిలో మోడీ పాత్ర‌ను పైకి ఎత్త‌నూ లేదు.. కింద‌కి దింప‌నూ లేదు. ఆది నుంచి భార‌త్ చెబుతున్న‌దే మోడీ వ‌ల్లెవేశార‌ని పేర్కొంది.

ఇక‌, జీ -20 విష‌యానికి వ‌స్తే.. ఇది రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో 20 దేశాలు ప్ర‌తి ఏటా పంచుకునే పందేరం. ఇది ప్ర‌త్యేకంగా భార‌త్‌కు ద‌క్కిన అవ‌కాశం కాదు. పైగా జీ-20 దేశాల ఖ‌ర్చును ఏ దేశం నిర్వ‌హిస్తే అదే పెట్టుకో వాలి. అందుకే.. వ‌చ్చే బ‌డ్జెట్లో జీ-20 ప‌న్నులు వ‌డ్డించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఇక‌, ఎటొచ్చీ.. పాకి స్థాన్ విష‌యం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

ప్ర‌పంచ దేశాల‌కు సుద్దులు చెబుతున్నామ‌న్న మోడీ.. పొరుగున ఉన్న పాకిస్థాన్ విష‌యంలో మాత్రం మౌనంగా ఉంటున్నార‌నేది ప్ర‌పంచ దేశాల మీడియా కోడై కూస్తున్న వార్త‌. ఇటీవ‌ల అక్క‌డ విదేశాంగ మంత్రి బిలావ‌ల్‌.. దారుణ‌మైన‌వ్యాఖ్య‌లే చేశారు. మోడీని హిట్ల‌ర్‌తో పోల్చారు. ఇక‌, తాజాగా అధికార పార్టీ నేత షాజియా.. భార‌త్‌పై అణుయుద్ధానికి వెనుకాడ‌బోమ‌ని హెచ్చ‌రించారు.

ఈ రెండు ప‌రిణామాలు కూడా వెను వెంట‌నే చోటు చేసుకున్నాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు మోడీ స్పందించ‌క‌పోవ‌డంపై అంత‌ర్జాతీయ స‌మాజం నివ్వెర పోతోంది. స్వ‌తంత్ర విదేశాంగ విధానం అనుస‌రిస్తున్నామ‌ని చెబుతున్న భార‌త్‌.. పొరుగున ఉన్న చైనా, పాక్‌ల‌ను నియంత్రించ‌లేక‌పోతుండ‌డంపైనా పెద‌వి విరుపులు వ‌స్తున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.