Begin typing your search above and press return to search.

కోహ్లీ అతిపై నిప్పులు చెరుగుతున్నారు.

By:  Tupaki Desk   |   22 Jun 2017 11:21 AM GMT
కోహ్లీ అతిపై నిప్పులు చెరుగుతున్నారు.
X
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత లండన్‌ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకొని కెప్టెన్సీకి కుంబ్లే గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అస‌లే పాకిస్థాన్ చేతిలో ఓట‌మితో అవ‌మాన‌భారంలో ఉన్న భార‌త క్రికెట్ అభిమానులు ఇప్ప‌డు కోహ్లీ చేష్ట‌ల‌పై మండిప‌డుతున్నారు. ఓట‌మికి బాధ్యుడిగా చేయ‌డంతో పాటుగా క్రికెట్ ప‌రువును గంగ‌పాలు చేస్తున్న కోహ్లీని టీం నుంచి త‌ప్పించాల‌ని కోరుతున్నారు. ధోనీని కెప్టెన్ చేస్తేనే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తాయ‌ని, మ‌న టీం ప‌రువు నిలుస్తుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

కుంబ్లే శిక్షణ ఇచ్చే శైలి నచ్చడం లేదన్న విరాట్ కోహ్లీకి ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణాన్ని అందించిన ఏకైక భారతీయుడు అభినవ్ బింద్రా అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. విరాట్‌ తో తనకు పొసగడం లేదంటూ వైదొలిగిన కుంబ్లే విలువ తెలిసేలా..అతన్ని వద్దనుకున్న కోహ్లీని ఎలాంటి పేరు పెట్టకుండానే సూటిగా తగిలేలా ఒక్కమాటతో జవాబిచ్చాడు. ``నాకు శిక్షణ ఇచ్చిన అత్యుత్తమ గురువుల్లో కోచ్ ఉవి రీస్టెసర్ ఒకరు. ఆయనంటే నాకు ఇప్పటికీ ఇష్టం లేదు. అతనంటే పరమ అసహ్యం. కానీ ఆయనతో నేను 20 ఏళ్లు కలిసి పని చేసాను`` అని బుల్లెట్‌ లాంటి మాటలతో దిమ్మదిరిగేలా బింద్రా ట్వీట్ చేశాడు.

కోచ్ పదవినుంచి కుంబ్లే తప్పుకోవడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ నిరాశ వ్యక్తం చేశాడు. మరికొంతకాలం కుంబ్లే కొనసాగుతాడని భావించినా.. అతను రాజీనామా చేయడం నిరాశను కలిగించిందన్నాడు. పోరాటయోధుడిగా పేరొందిన కుంబ్లే రాజీనామా చేయకుండా సీఏసీ ఇచ్చిన మద్దతుతో మరింత కాలం కొనసాగి ఉంటే బాగుండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

వివాదాస్పద ట్వీట్‌ లతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటుడు - విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్‌ కే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడడంతో భారత సారథి విరాట్‌ ను పూర్తిగా క్రికెట్ నుంచే బహిష్కరించాలంటూ ట్వీట్ చేశాడు. అంతేనా.. కోహ్లీ ఫిక్సింగ్‌ కు పాల్పడ్డాడంటూ, అతణ్ని జైలుకు పంపాలన్నా డు. ఫైనల్లో ఘోరంగా ఓడి 130 కోట్ల భారతీయులను మోసం చేసిన భారత క్రికెట్ జట్టు సభ్యులపై లండన్ నుంచి రాగానే ఎయిర్‌ పోర్ట్‌ లో గుడ్లు - టమాటాలు విసిరి తమ నిరసన వ్యక్తం చేయాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ.. తొలుత నీవు ఇచ్చిన క్యాచ్‌ను పాక్ ఫీల్డర్లు వదిలేశారు. అయినా, ఆ వెంటనే మరో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగావు. దీన్ని బట్టి చూస్తుంటే నీవు ఫిక్సింగ్‌ కు పాల్పడ్డావని స్పష్టమవుతున్నది. ఇంతమంది కోట్ల భారతీయుల ప్రతిష్ఠను పాకిస్థాన్‌ ను అమ్మేసిన నిన్ను పూర్తిగా ఆటనుంచి బహిష్కరించాలి. జైలుకు పంపాలి. నీతో పాటు ధోనీ - యువరాజ్‌ లు కూడా ఫిక్సర్లే. కేంద్ర ప్రభుత్వం వెంటనే కలుగుజేసుకొని బీసీసీఐ గుర్తింపును కూడా రద్దు చేయాలి అని కేఆర్‌ కే వరుస ట్వీట్‌ లలో విమర్శలు గుప్పించాడు.

ఇదిలాఉండ‌గా.. కుంబ్లే - విరాట్ మధ్య విభేదాలు పరిష్కరించడంలో సీఏసీ చేతులెత్తేయడంతో బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగింది. దీంతో జట్టు బస చేసిన హోటల్‌లో మూడు సమావేశాలు నిర్వహించింది. ముందుగా కుంబ్లే.. బీసీసీఐ అధికారులతో సమావేశమయ్యాడు. చర్చల సందర్భంగా విరాట్‌ తో తనకు ఎలాంటి సమస్య లేదని అనిల్ పదేపదే చెప్పాడు. తన కోచింగ్‌ పై కోహ్లీకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, ఇవి పెద్ద సమస్యలు కావని తేల్చాడు. ఆ తర్వాత సీఏసీతో సమావేశమైనా అక్కడ ఏం జరిగిందనేది బహిర్గతం కాలేదు. ఇక మూడో సమావేశంలో కుంబ్లే, విరాట్‌ను టేబుల్‌ కు ఎదురెదురుగా కూర్చోబెట్టి బీసీసీఐ రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/