Begin typing your search above and press return to search.
చాయ్ వద్దన్న కేంద్ర మాజీ మంత్రి..ట్వీట్ వైరల్
By: Tupaki Desk | 25 March 2018 1:43 PM GMTసాధారణ టీకొట్టులో టీ ధర ఎంతుంటుంది? చెప్పండి... 10 రూపాయలు అనుకోండి. మరీ.. ఓ మోస్తారు రెస్టారెంట్లలో ఓ 30 రూపాయలు అనుకోండి. ఫైవ్ స్టార్ హోటల్స్ లో అయితే.. వందల్లో ఉంటుంది. అయితే.. ఫైవ్ స్టార్ హోటల్స్‌లో టీ అంటే.. టీ ఒక్కటే ఉండదు. దాంతో పాటు బిస్కెట్లు - స్నాక్స్.. ఎక్స్ ట్రా ఉంటాయి.. కాబట్టి అంత పే చేయొచ్చు. మరి.. ఓ విమానాశ్రమంలోనూ టీ కాస్ట్ విపరీతంగా ఉంటే ఏం చేయాలి. అటువంటి పరిస్థితి ఎదురైంది ఎవరికో కాదు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి. అది కూడా అలాంటి ఇలాంటి షాక్ కాదు.
మాజీ కేంద్రమంత్రి చిదంబరం తన ట్విట్టర్ అకౌంట్లో తెలిపిన వివరాల ప్రకారం...చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న కాఫీడేకు వెళ్లి టీని ఆర్డర్ చేశారట. వాళ్లు కొంచెం వేడి నీళ్లు, ఓ టీ బ్యాగ్ ఇచ్చి దానికి రూ. 135 బిల్లు వేశారట. దీంతో ఖంగుతిన్న ఆయన అంత ఖరీదైన టీ అవసరం లేదని చెప్పి వెళ్లిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా చిదంబరమే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సరే.. కాఫీ ధర ఎంత అని అడిగారట. అప్పుడు వాళ్లు రూ.180 అని సమాధానం చెప్పారట. అసలు ఇంత రేటు పెట్టి ఎవరైనా కొంటారా? అని కాఫీడే సిబ్బందిని ప్రశ్నిస్తే.. చాలా మంది అంత రేటు పెట్టి తాగి వెళ్తుంటారు అని చెప్పారట సిబ్బంది. అంటే నేనే ఇంకా పాతకాలంలోనే ఉన్నానా? అంటూ మరో ట్వీట్ చేశారు చిదంబరం!
అయితే ఈ ట్విస్టుల పరంపర ఇక్కడితోనే ఆగిపోలేదు. చిదంబరం ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నెటిజన్లు భిన్నంగా స్పందించారు. చిదంబరం ట్వీట్లపై విరుచుకుపడ్డారు. మీ హాయంలో జరిగిన స్కాముల వల్లే ఇప్పుడు ఈ దేశానికి ఇటువంటి గతి పట్టింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.