Begin typing your search above and press return to search.

అరగంట ప్రధాని కాన్వాయ్ ఆగిన వైనంలో అతడే అసలు కారణమట

By:  Tupaki Desk   |   26 Aug 2022 8:30 AM GMT
అరగంట ప్రధాని కాన్వాయ్ ఆగిన వైనంలో అతడే అసలు కారణమట
X
దేశ ప్రధానమంత్రి వస్తున్నారంటే.. భద్రతా ఏర్పాట్లు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పర్యటించే ప్రాంతాల్ని 24 గంటల ముందే తమ అధీనంలోకి తీసుకొనే ప్రత్యేక భద్రతా సిబ్బంది మొదలుకొని.. చీమ చిటుక్కుమన్నా.. తెలిసేలా ఏర్పాట్లు సాగుతాయి.

అలాంటిది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు భటిండా నుంచి ఫిరోజ్ పూర్ కు రోడ్డు మార్గంలో వెళ్లటం.. ఆ సందర్భంగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళన కారణంగా.. ఒక బ్రిడ్జ్ మీద దాదాపు గంట పాటు నిలిచిపోయిన వైనం షాకింగ్ గానే కాదు.. పీఎంవో చరిత్రలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్న సందర్భమే లేదన్న మాట వినిపిస్తోంది.

ఈ ఉదంతంపై కేంద్ర హోంశాఖ సీరియస్ గా మారటమే కాదు.. అసలు కారణం ఏమిటి? దీనికి బాధ్యులు ఎవరు? లాంటి ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. తాజాగా దీనికి సంబంధించిన నివేదిక ఒకటి బయటకు వచ్చింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది.

ప్రధాని భద్రతా వైఫల్యాలకు అసలు కారణాలు ఏమిటన్న అంశంపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ విచారణ పూర్తిచేసిన నివేదిక సమర్పించింది.

అందులో.. ప్రధాని మోడీ భద్రతా వైఫల్యాలకు కారణం ఎవరన్న అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. 'అసలు తప్పంతా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫిరోజ్ పూర్ ఎస్ఎస్ పీ నిర్లక్ష్యమే కారణమంటూ నివేదిక స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. జస్టిస్ సూర్యకాంత్.. జస్టిస్ హిమా కోహ్లీతో పాటు ధర్మాసనం ప్రధానమంత్రి భద్రతా వైఫల్యంపై సిద్ధం చేసిన నివేదికను చదివి వినిపించటం గమనార్హం.

ప్రధాని మోడీ పర్యటనకు రెండు గంటల ముందే ఫిరోజ్ పూర్ ఎస్ఎస్ పీకి సమాచయారం పంపినా.. సరైన చర్యలు చేప్టటలేదన్నారు. ఇందులో కేంద్రభద్రతా బలగాల వైఫల్యం ఎంత మాత్రం లేదని.. కేవలం పంజాబ్ పోలీసు అధికారి వైఫ్యల్యమని పేర్కొనటం గమనార్హం. తాజా నివేదికను కేంద్రానికి పంపుతామని.. ఆ తర్వాత సంబంధిత చర్యలు ఉంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.