Begin typing your search above and press return to search.
భూకంపంలోను ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని !
By: Tupaki Desk | 25 May 2020 12:45 PM ISTన్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డన్స్ మరోసారి తన మార్క్ ఏకాగ్రతను ప్రదర్శించారు. భూకంపం వచ్చినా కూడా జంకకుండా తను ఓ టీవీ ఛానల్‌కు ఇస్తున్న ఇంటర్వ్యూను నవ్వులు చిందిస్తూ కొనసాగించారు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ రోజు తెల్లవారుజామున ఉత్తర ఐలాండ్‌లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే సమయంలో జెసిండా వెల్లింగ్టన్‌లోని పార్లమెంట్ భవనం నుంచి ఓ ఛానెల్‌తో లాక్ డౌన్ పై ఇంటర్వ్యూ ఇస్తున్నారు.
ఈ సమయంలో భూకంపం దాటికి భవనం కొద్దిగా కంపించసాగింది. అయినప్పటికి జెసిండా భయపకుండా నవ్వుతూ తన ఇంటర్వ్యూను కొనసాగించారు. అంతేగాక, ఆ ఇంటర్వ్యూలో భూకంపం గురించి విశేషాలను చెప్పారు. ఇక్కడ చిన్న పాటి భూకంపం వచ్చిందని, భూమి కొద్దిగా కదులుతోందని ఆమె వ్యాఖ్యానించారు. అక్కడి పరిసరాలు కదలడం వీడియోలో కనపడ్డాయి. ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడే ఇక్కడ చిన్న పాటి భూకంపం వచ్చింది. భూమి కొద్దిగా కంపిస్తోంది. నువ్వు చూసినట్లైతే నా ముందున్న ప్రదేశం కంపించటం గమనించవచ్చు. ఆ తరువాత భూమి కంపించటం ఆగిపోయింది. మేమంతా క్షేమంగా ఉన్నాం. నేను భూకంపాలకు తట్టుకునే భవనంలో ఉన్నానని అనుకుంటున్నాను అని తెలిపారు.