Begin typing your search above and press return to search.
ప్రధాని మోడీ ఫెయిల్యూర్ ... అందుకే సైలెంట్ అయ్యాడా !
By: Tupaki Desk | 14 May 2021 1:30 AM GMTమనదేశం మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభంలో మునిగిపోయింది. ప్రపంచంలో ఏ దేశంలో నమోదు కానటువంటి కేసులు ఇండియా లోనే నమోదు అవుతున్నాయి. ఈ సమయంలో దేశప్రధానమంత్రిగా పలు కీలక నిర్ణయాలు తీసుకోని, దేశాన్ని కరోనా సంక్షోభం నుండి బయటపడేయాల్సిన మోడీ..ప్రస్తుతం ఆత్మ సంరక్షణలో పడిపోయినట్లు అనిపిస్తుంది. కనీసం, దేశంలో నెలకొన్న కరోనా పరిస్థుతుల పై రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడా చర్చలు కూడా జరపడంలేదు. కరోనా వైరస్ నియంత్రణకు మొదటి దశలో ఎక్కువ చొరవ చూపించారు. అయితే, ఆ తర్వాత చివరలో ఫెయిలయ్యారు. రాత్రికి రాత్రి లాక్ డౌన్ విధించిన కారణంగా సుమారు 16 కోట్లమంది వలసకూలీలు పడిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు.
ఇదే ప్రధాని మోడీ మొదటి ఫెయిల్యూర్. అలాగే కుదేలైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ఎంతో ఆర్భాటంగా రు. 20 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మనిర్భర్ పథకం అసలు ఎవరికీ ఉపయోగపడిందో కూడా సామాన్య ప్రజలతో సహా కొందరు ప్రజా ప్రతినిధులకి కూడా తెలియదు. ఇది రెండో ఫెయిల్యూర్. ఇక మరో ముఖ్యమైన ఫెయిల్యూర్ ఏమిటి అంటే .. దేశంలో కరోనా సెకండ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నా మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకి వెళ్లి అతి పెద్ద తప్పు చేశారు. శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు ముందే హెచ్చరించినా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుని హెచ్చరికలను పెడచెవిన పెట్టి భారీ ర్యాలీలు తీశారు. నిపుణుల హెచ్చరికలను విని మార్చి చివరిలోనే లాక్ డౌన్ విధించేసుంటే సమస్య ఇంత జఠిలం అయ్యేది కాదు. ఇక , దేశవ్యాప్త లాక్ డౌన్ విధించకుండా ఆ విషయాన్ని రాష్ట్రాలకే వదిలేయటం మోడీ చేతకానితనం కిందకే వస్తుంది. ప్రధాని మోడీ ఇచ్చిన వెసులుబాటు కారణంగా ఏ రాష్ట్రం కూడా సంపూర్ణ లాక్ డౌన్ విధించలేదు. పాక్షిక లాక్ డౌన్ , కర్ఫ్యూస్ అంటూ పుణ్యకాలం కాస్త గడిపేశారు. మరోవైపు కరోనా తన పని తాను చేసుకుపోయింది. దేశంలో రోజుకి మూడు లక్షలకి పైగా కేసులు నమోదు అయ్యేలా వ్యాప్తిచెందింది.
ఇక కరోనా వ్యాక్సిన్ ల సరఫరా, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా విషయంలో కూడా మోడీ ఫెయిల్యూర్ స్పష్టంగా తెలిసిపోతోంది. దీనితో ఏడేళ్ళుగా నిర్మించుకున్న ఇమేజ్ మసకబారిపోయింది. దీని ఫలితంగా మోడిని ఇపుడు దేశంలోని అన్నీ వర్గాల నుండి ఆరోపణలు, విమర్శలు చుట్టుముట్టేశాయి. తన వైఫల్యాలు కళ్ళముందు కనబడుతున్నాయి కాబట్టే ఎవరికీ సమాధానాలు చెప్పుకోలేక సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కి కారణం మాత్రం ఐదు రాష్ట్రాల ఎన్నికలే కారణం. గతంలోలాగా మోడి ఏమి చెబితే చప్పట్లు కొట్టడంలేదు జనాలు. మోడీ రాజీనామాకు ట్విట్టర్లో పెరిగిపోతున్న డిమాండే దీనికి నిదర్శనం. ఎంతో కాలం షో చేస్తు జనాలను మాయ చేయలేరనే విషయం బహుశా మోడీకి కూడా అర్ధమైపోయుంటుంది. అందుకనే వేరేదారి లేక చివరకు తనమీద వస్తున్న ఆరోపణలు, విమర్శలకు సైతం సమాదానాలు చెప్పుకోలకనే సైలెంట్ అయ్యారని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు.