Begin typing your search above and press return to search.
తమిళ ఓటర్లపై మోడీ `పాటల` మంత్రం!
By: Tupaki Desk | 10 March 2021 3:30 AM GMTఏ ఎండకు ఆ గొడుగు పట్టడం.. రాజకీయ నేతలకు అలవాటే. అయితే.. ఈ విషయంలో మరిన్ని ఆకులు ఎక్కువగా చదివిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇతర నేతలను మించిపోయేలా.. తనదైన శైలిని అనుసరిస్తు న్నారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన హావ భావాలను సమూలంగా మార్చుకున్నారు. బెంగాలీ ప్రజల ఆరాధ్య దైవం.. రవీంద్రనాథ్ ఠాగూర్‌ను మరిపించేలా ఆయన మోడీ.. గడ్డం పెంచుకున్నారు.. ఇక, ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఇటీవల వెళ్లినప్పుడు కూడా అచ్చు రవీంద్రుని మాదిరిగా కట్టుబొట్టుతో ప్రత్యక్షమయ్యారు..
ఇక, ఇప్పుడు తమిళనాడుపై కూడా ప్రధాని మోడీ.. తనదైన శైలిని మార్చుకుంటున్నారు. ఇక్కడి ప్రజలకు తమ భాష, తమ కవులు, తమ పాటలు అంటే ప్రాణం పెడతారు. ఈ నేపథ్యంలోనే మోడీ.. తమిళులకు చేరు వయ్యేందుకు వారి భాషను నేర్చుకుంటున్నారు. త్వరలోనే తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోడీ సుడిగా లి పర్యటన చేయనున్నారు.. తమిళులను బీజేపీవైపు ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన... ఇక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు.. తమిళ భాషతోపాటు.. ఇక్కడి తిరుక్కురళ్ కవితలు, తమిళ సంప్రదాయాన్ని ఔపోసన పడుతున్నారు.
అయితే.. ఇవి కూడా ఏమేరకు వర్కువుట్ అవుతాయో.. అవవో అనుకున్నారో..ఏమో.. ఇప్పుడు ఏకంగా తమిళ పాటలను కూడా కంఠస్తం చేస్తున్నారట ప్రధాని మోడీ. దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ నటించిన చిత్రంలోని ఓ ప్రజాదరణ పొందిన పాటను ప్రధానని కంఠస్థం చేస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రధాని సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. రాష్ట్రప్రజలకు మరింత దగ్గరయ్యేలా, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి విజయం సాధించేలా ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో, తన ప్రసంగంలో ఎంజీఆర్-జయలలిత నటించిన చిత్రంలోని ప్రజాదరణ పొందిన పాట వుండాలని భావిస్తున్నారు.. ఈ క్రమంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి, ఆ పాటను బట్టీపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫీట్లు తమిళులను ఆకట్టుకుంటాయో లేదో చూడాలి.