Begin typing your search above and press return to search.

ఆరోగ్య కార్యకర్తలందరికీ 2020 సంవత్సరం అంకితం : ప్రధాని మోడీ

By:  Tupaki Desk   |   31 Dec 2020 11:10 AM GMT
ఆరోగ్య కార్యకర్తలందరికీ 2020 సంవత్సరం అంకితం : ప్రధాని మోడీ
X
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తూనే ఉంది. కరోనా తో పాటుగా కొత్తగా వెలుగులోకి వచ్చిన కొత్త కొరోనా స్ట్రెయిన్ వైరస్ తో ఆందోళన మరింత పెరిగింది. ఇక కరోనా ను అంతం చేసే వ్యాక్సిన్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మరో పిలుపునిచ్చారు. కరోనాపై సమిష్టిగా ఎలాగైతే పోరాడామో అదే ఐకమత్యాన్ని వ్యాక్సినేషన్ విషయంలో కూడా చూపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఈ రోజు గుజరాత్‌‌ లోని రాజ్ ‌కోట్‌ లో ఏయిమ్స్ కి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. దేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరో అడుగు పడిందని ఆనందం వ్యక్తం చేశారు. 2020 సంవత్సరానికి నూతన ఆరోగ్య మౌలిక సదుపాయాలతో వీడ్కోలు పలకాలని , ఈ సంవత్సరం మనం ఎంత ఇబ్బందిపడ్డామన్నది ఈ మౌలిక సదుపాయాలే చూపిస్తున్నాయని అన్నారు. ప్రజల సంరక్షణార్థమై ఈమధ్య కాలంలో ఆరోగ్యపరంగా చాలా రకాలైన సౌకర్యాలు వచ్చాయని, ఆరోగ్యపరమైన ప్రభుత్వ పథకాల విషయంలోనూ చాలా చైతన్యవంతులయ్యారని ప్రధాని మోదీ తెలిపారు. భవిష్యత్తులో ఆరోగ్యం విషయంలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు అవసరమైన ఆలోచనలను స్వీకరించడానికి కానీ, ఇవ్వడానికి కానీ సిద్ధంగా ఉన్నామని అన్నారు. దేశం మొత్తాన్ని సురక్షితంగా ఉంచడానికి కష్టపడ్డ ఆరోగ్య కార్యకర్తలందరికీ 2020 సంవత్సరం అంకితం చేస్తున్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటించారు.