Begin typing your search above and press return to search.
ఆకాశం నుంచే ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ చూసిన ప్రధాని మోడీ
By: Tupaki Desk | 14 Feb 2021 11:02 AM GMTప్రధాని నరేంద్రమోడీ ఆశ్చర్యపరిచాడు. ఇండియా-ఇంగ్లండ్ ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టును ఆయన ఆకాశం నుంచి వీక్షించారు. ఈ విషయాన్ని మోడీనే ట్విట్టర్ ద్వారా వెల్లడించడం విశేషం. దానికి సంబంధించిన ఫోటోను షేర్ చేయగా వైరల్ అయ్యింది.
తమిళనాడు పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ ఆకాశంలో విమానంలో చెపాక్ మైదానం మీదుగా వెళ్తుండగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను ఆసక్తికరంగా తిలకించాడు. ఆ ఫొటోను తీసుకొని ‘చెన్నైలో జరుగుతున్న ఆసక్తికర మ్యాచ్ కు సంబంధించి స్పెషల్ వ్యూ లభించింది’ అని విమానంలోంచి తీసిన ఫొటోను షేర్ చేసి వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ కు హాజరైన ఆటగాళ్లలో మరింత ఉత్సాహం నింపారు.
భారత్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 329 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. అయితే భారత్ ను ఔట్ చేసి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ కుప్పకూలారు. భారత బౌలర్ధ ధాటికి రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 52 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 195 పరుగుల ఆధిక్యం లభించింది.

Caught a fleeting view of an interesting test match in Chennai.