Begin typing your search above and press return to search.
పార్లమెంటు తలుపులు మూసి ఏపీని విభజించారు: మోడీ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 8 Feb 2022 10:30 AM GMTఆంధ్రప్రదేశ్ విభజనపై రాజ్యసభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారని, పార్లమెంటు తలుపులు మూసేసి అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారని దుయ్యబట్టారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని వ్యాఖ్యనించారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్న మోడీ..ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరు సరికాదన్నారు.
కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని ఆక్షేపించారు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని..,కానీ ఎవరికీ నష్టం కలగకుండా శాంతియుత వాతావరణంలో రాష్ట్రాల ఏర్పాటు జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ను సరిగ్గా విభజన చేసి ఉంటే సమస్యలు వచ్చేవి కావని ప్రధాని అన్నారు. మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ర్పే వాడారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి. అని ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్నారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శ నమన్నారు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని,. శాంతియుత వాతావరణంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరు సరికాదని,. సరిగ్గా విభజన చేసి ఉంటే సమస్యలు వచ్చేవి కావని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం.. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపింది.
రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని మోడీ స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విభజన తీరును తప్పుబట్టారు. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు చాలా సూటిగా ఉండడం గమనార్హం. కలిసి చర్చిస్తే విభజన ప్రక్రియ సాఫీగా జరిగేదన్నారు. హడావుడిగా చర్చలేకుండానే విభజన బిల్లును ఆమోదిచారని దుయ్యబట్టారు.
తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదని మోడీ మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికార గర్వం వల్ల సమస్యను జఠిలం చేసిందన్నారు. విభజన చట్టంపై ఎలాంటి చర్చ జరపలేద న్నారు. ఏపీ వల్ల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ రాష్ట్రానికి అన్యాయం చేసిందని మోడీ చెప్పడంగమనార్హం. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. మొత్తానికి మోడీ వ్యాఖ్యలు సంచలన రేపుతున్నా.. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. మోడీ ఇలా..ఏపీ తెలంగాణలను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్‌ను కార్నర్ చేయడం ఇదే కొత్తకాదు. గతంలోనూ చేశారు. అయితే.. చిత్రం ఏంటంటే.. కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడల్లా.. మోడీకి ఏపీ, తెలంగాణ విభజన అంశం గుర్తుకు వస్తుంది.