Begin typing your search above and press return to search.
సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ !
By: Tupaki Desk | 21 Dec 2019 5:24 AM GMTఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు 47వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. పుట్టిన రోజు సందర్భం గా సీఎం జగన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదిక గా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలి అంటూ ఆకాంక్షించారు. అలాగే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కి ట్విటర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని ఆయన కోరుకున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తం గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాల తో పాటూ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి జగన్ తన పుట్టిన రోజు నాడే కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. తన పుట్టినరోజు నాడే ఈ పథకం ప్రారంభించడం వెనుక ఆసక్తికర కారణం ఉందట. తనకు చేనేతలే గుర్తు వచ్చారన్నారు జగన్. అమ్మ ఒడి, నాడు-నేడు లాంటి ప్రతిష్టాత్మక పథకాలెన్నో ఉండగా దీన్ని మాత్రమే తన బర్త్‌డే రోజు లాంచ్ చేయడం ఏమిటి అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. చేనేతలతో తన తండ్రి వైయస్సార్‌కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేందుకే సీఎం జగన్ తన పుట్టిన రోజున నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.