Begin typing your search above and press return to search.
సామాన్యులుగా మారిన తర్వాత వదల్లేదు..తాజాగా మరిన్ని ఫోటోలు బయటకు
By: Tupaki Desk | 22 Jan 2020 5:44 AM GMTబ్రిటీష్ రాజకుటుంబం బాధ్యతల నుంచి తప్పుకున్న హ్యారీ నిర్ణయం ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రాచకుటుంబం నుంచి బయటకు వచ్చి.. సామాన్యులగా బతికే ప్రయత్నాన్ని మీడియా ఫోటోగ్రాఫర్లు చేస్తున్న ప్రయత్నాలపై హ్యారీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన భార్య మేఘన్ మోర్కెల్.. తన ఎనిమిది నెలల కుమారుడు ఆర్కీ ఫోటోలను పబ్లిష్ చేసిన సన్.. డెయిలీ మెయిల్ మీడియా సంస్థలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఆయన మాటలకు తగ్గట్లే.. ఆయన న్యాయవాదులు సదరు మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఇంతకీ సదరు మీడియా సంస్థలు పబ్లిష్ చేసిన ఫోటోల్లో ఏమున్నందంటే.. మేఘన్ ముందు భాగాన జోలీ లాంటివి వేసుకొని ఉంటే.. అందులో తన కుమారుడ్ని ఉంచారు. రెండు పెంపుడు కుక్కలతో కలిసి తన కొత్తింటికి వెళుతున్న ఫోటోలని పబ్లిష్ చేశారు.
తమ అనుమతి లేకుండా దొంగచాటుగా తీసిన ఫోటోల్ని పబ్లిష్ చేయటం తప్పని హ్యారీ మండిపడుతున్నారు. తమ అనుమతి లేకుండా తాము నివాసం ఉండే వాంకోవర్ దీవిలో తమ ఫోటోల్ని తీసిన వారిపైనా చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. కెమేరా క్లిక్ మన్న ప్రతిసారీ తన తల్లి చావే తనకు గుర్తుకు వస్తుందని హ్యారీ ఆవేదన వ్యక్తం చేశారు. హ్యారీ తల్లి డయానా తన బాయ్ ఫ్రెండ్ తో రహస్యంగా కారులో వెళుతున్న వేళ.. ఫోటోలు తీసేందుకు ప్రయత్నించటం.. వారికి చిక్కకూడదన్న ఉద్దేశంతో వేగంగా వెళుతున్న వేళ రోడ్డు ప్రమాదంలో మరణించటం తెలిసిందే. రాచ కుటుంబాన్ని వదిలేసిన తర్వాత కూడా తమను వదలని ఫోటోగ్రాఫర్లపై హ్యారీ తీవ్ర మండిపాటును ప్రదర్శిస్తున్నారు. మరి.. ఆయన కేసుల విషయంలో కోర్టు ఏ రీతిలో రియాక్ట్ అవుతుందో చూడాలి.