Begin typing your search above and press return to search.
తాజ్ మహల్ గురించి ప్రిన్స్ హ్యారీ తన భార్యకు అలా చెప్పాడా?
By: Tupaki Desk | 11 Jan 2023 6:01 AM GMTతాజ్ మహల్ ఈ పేరు వింటేనే ప్రేమికులు పులకించి పోతుంటారు. షాజహాన్ తన భార్య ముంతాజ్ పై ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ ను నిర్మించాడని చరిత్రకారులు చెబుతుంటారు. పాలరాతి శిల్పాలతో అత్యద్భుతంగా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా నిలిచింది. విదేశీయులు భారత్ సందర్శించినప్పుడు తప్పకుండా తాజ్ మహల్ ను సందర్శించాలని కోరుకుంటారు.
ఈ ప్రాచీన కట్టడం ముందు ఒక్క ఫోటో అయినా దిగి జీవితంలో చిరస్మరణీయమైన జ్ఞాపకంగా ఉంచుకోవాలని భావిస్తుంటారు. ఎంతో మంది ప్రపంచ నేతలు.. వారి భార్యలు.. ప్రముఖులు ఈ తాజ్ మహల్ సందర్శించి ఇది ఒక అద్భుత కట్టడమని కొనియాడారు. ఈ క్రమంలోనే 2017 జనవరిలో ఓ ఛారిటీ కార్యక్రమంలో భాగంగా ప్రిన్స్ హ్యారీ ప్రియురాలు మేఘన్ భారత్ కు వచ్చారు. ఆ తర్వాతనే ప్రిన్స్ హ్యారీ మేఘన్ లకు వివాహం జరిగింది.
కాగా ప్రిన్స్ హ్యారీ 'స్పేర్' పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకంలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో భారత్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ప్రిన్స్ హ్యారీ తన పుస్తకంలో పొందుపరిచారు.
ఈ క్రమంలోనే తాజ్ మహల్ గురించి ప్రిన్స్ హ్యారీ ప్రస్తావించారు. అయిదేళ్ల కిందట మేఘన్ మార్కెల్ భారత్ పర్యటనకు వచ్చినపుడు తాజ్ మహల్ ముందు ఫోటో దిగవద్దని సూచించినట్లు 'స్పేర్' పుస్తకంలో ప్రిన్స్ హ్యారీ పేర్కొన్నాడు.
ఇందుకు గల కారణాన్ని సైతం ప్రిన్స్ హ్యారీ వెల్లడించారు. ''పాలరాతి కట్టడమైన తాజ్ మహల్ ముందు మేఘన్ ను ఫొటో దిగవద్దని సూచించా.. ఎందుకంటే.. ఆ అద్భుతమైన కట్టడం ముందే నా తల్లి (ప్రిన్స్ డయానా) ఫొటో దిగారు.. ఆ ఫొటో ఎంతో ప్రాచుర్యం పొందింది.. దాన్ని చూసినవారు మేఘన్ మా అమ్మను అనుకరిస్తుందని అనుకోవడం ఇష్టం.. అందుకే అలా చెప్పాను.." అంటూ ప్రిన్స్ హ్యారీ తాను రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.