Begin typing your search above and press return to search.
ట్విస్టిచ్చిన బ్రిటన్... పాక్ కు సపోర్ట్
By: Tupaki Desk | 16 Oct 2019 5:30 PM GMTఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్ పై ప్రతిరోజు తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ వేదికలపై సైతం భారత్ ని దోషిగా నిలబెట్టేందుకు ఎప్పటికప్పుడు విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికాతో పాటు - మన మిత్రదేశమైన రష్యాతో పలు దేశాలు సైతం ఈ విషయంలో పాకిస్తాన్ తీరును తప్పుపడుతున్నా పాక్ మాత్రం తన వక్రబుద్ధి వదలటం లేదు. ప్రపంచ దేశాల్లో ఒకటి రెండు దేశాల మినహా అన్ని దేశాలు ఈ విషయంలో భారత్ కు తమ మద్దతు తెలియజేస్తున్నాయి.
అయితే తాజాగా ఐక్యరాజ్యసమితిలో వీటో హక్కు ఉన్న బ్రిటన్ దేశ యువరాజు మాత్రం పాకిస్తాన్ తమకు అత్యంత ముఖ్యమైన దేశం అని ప్రకటించడం విచిత్రంగా కనిపిస్తోంది. తాజాగా బ్రిటన్ రాజ వంశీయుడు ప్రిన్స్ విలియం పాకిస్తాన్లో పర్యటిస్తున్నారు. బాలికా విద్య - సమానత్వం - వాతావరణంలో మార్పులు లాంటి సామాజిక అంశాలపై ప్రిన్స్ దంపతులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జి ప్రిన్స్ విలియం - డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి కేట్ మిడిల్టన్ ఐదు రోజుల పాటు పాక్ పర్యటనకు బయల్దేరారు.
ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ - అధ్యక్షుడు అల్విలను రాజ దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సామాజిక అంశాల అవగాహనకు విలియం దంపతులు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న కృషిని అభినందించారు. ఈ నేపథ్యంలోనే విలియం తల్లి ప్రిన్స్ డయానాకు పాకిస్తాన్ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని సైతం ఇమ్రాన్ గుర్తు చేశారు. 2006 తర్వాత బ్రిటన్ రాజవంశీకులు పాకిస్తాన్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రిన్స్ దంపతులను అభినందించిన ఇమ్రాన్.. భారత్ - అఫ్ఘనిస్తాన్ దేశాలతో పాకిస్తాన్ కు ఉన్న సంబంధాలను వివరించడంతో పాటు... జమ్మూ కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ తో తమకు తలెత్తిన సమస్యలను సైతం వివరించారు.
ఈ క్రమంలోనే విలియం యూకే విద్యా విధానాన్ని అనుసరిస్తున్న కేట్ ఇస్లామాబాద్ లో ఉన్న మహిళ మోడల్ కాలేజీని సైతం సందర్శించారు. ఏదేమైనా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ తీరును ప్రతి ఒక్కరు తప్పు పడుతూ ఉంటే బ్రిటన్ యువరాజు మాత్రం పాకిస్తాన్ ను తమకు అత్యంత ముఖ్యమైన దేశంగా ప్రకటించడాన్ని బట్టి చూస్తే, భారత్ పాకిస్తాన్ సంబంధాల విషయంలో బ్రిటన్ తీరును సందేహించక తప్పదు