Begin typing your search above and press return to search.
హెచ్1బీ తప్పు ప్రింటింగ్..మన ఎన్నారైలకు షాక్
By: Tupaki Desk | 12 April 2017 9:25 AM GMTఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బారతీయులను తీవ్రంగా ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వీసాలు అందులో హెచ్1బీ వీసా హోల్డర్ల గుండెలు ట్రంప్ నిర్ణయంతో గుబేలు మంటున్నాయి. ప్రధానంగా ఈ వీసాల జారీ కఠిన నిబంధనలు తేవటంతో ఇప్పటికే చాలా మంది ఇండియన్స్ ఇబ్బందికి గురయ్యారు. తాజాగా హెచ్1బీ వీసా హోల్డర్స్ కు అమెరికా అధికారులు మరో షాకిచ్చారు. వీసా జారీలో తప్పుడు ప్రింటింగ్ చేశారు. దీంతో దేశీయ టెక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కసారిగా గుబులు ప్రారంభమైంది.
వీసా ప్రాసెసింగ్ సెంటర్స్ ఆధీనంలో పనిచేసే అమెరికా వీసా ప్రింటింగ్ ప్రెస్...పొరపాటున హెచ్1బీ కు బదులుగా `1బీ1` అని ప్రింట్ చేసింది. చాలా మంది వీసా హోల్టర్స్ వీసాహోల్డర్స్ పిటిషన్లలో హెచ్1బీ బదులుగా 1బీ1ను ఆమోదిస్తున్నట్టు పేర్కొంది. దీంతో అమెరికా ప్రయాణించాలనుకునే వారిలో ఆందోళన ప్రారంభమైంది. హెచ్1బీకి అప్లయి చేస్తే 1బీ1 రావడమేమిటని తలలు పట్టుకున్నారు. ఇటీవలే సస్పెండ్ అయిన ప్రీమియం ప్రాసెసింగ్ ప్రొగ్రామ్ ను రెన్యూవల్ చేయించుకోవడానికి అప్లయి చేసిన విదేశీ పాస్ పోర్టు హోల్డర్స్ ఈ తప్పుడు ప్రింటింగ్ ను గుర్తించారు. వారితో పాటు మిగతా అభ్యర్థులు గుర్తించి, యూఎస్సీఐఎస్ ని సంప్రదించేందుకు ప్రయత్నించారు.
ఐతే తమ గోడును అమెరికా అధికారులు పట్టించుకోలేదని హెచ్1బీ వీసా హోల్డర్స్ చెబుతున్నారు. 1బీ1 వల్ల అమెరికా వెలుపల ప్రయాణించాలంటే చాలా కష్టమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేర్కొన్నారు. ఈ తప్పుడు స్టాంపింగ్ తో స్వదేశానికి ప్రయాణించాలన్న వీలుపడదంటున్నారు. దీంతో ఈ వీసా విషయంలో అధికారులు తమ తప్పును సరిచేసుకోవాలని హెచ్1బీ వీసాదారులు కోరుతున్నారు. దీనిపై ట్రంప్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/