Begin typing your search above and press return to search.
రూ.100 నోట్ల ప్రింటింగ్ నిలిపివేశారా?
By: Tupaki Desk | 18 Nov 2016 4:17 AM GMTనిన్నమొన్నటి వరకూ నోట్లు.. వాటి ప్రింటింగ్ ముచ్చట మీద ఎవరి దృష్టి ఉండేది కాదు.కానీ.. ఈ నెల 8 రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రధాని మోడీ టీవీ స్ర్కీన్ మీదకు వచ్చి.. జాతిని ఉద్దేశించిన ప్రసంగిస్తూ రూ.1000.. రూ.500 నోట్లను అర్థరాత్రి నుంచి రద్దు చేస్తున్న సంచలన విషయాన్ని చెప్పిన క్షణం నుంచి దేశ ప్రజల దృష్టి మొత్తం కరెన్సీ నోట్ల మీదకు వెళ్లిందని చెప్పకతప్పదు.
ఆ రోజు మొదలు నోట్ల కోసం.. ప్రజలు పడుతున్న కష్టాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయే తప్పించి తగ్గని దుస్థితి. ఇదే అదునుగా ఊహాగానాలు వినిపిస్తున్న దుస్థితి. తగినన్ని నోట్లు ఉన్నాయని కేంద్రం చెబుతున్నా.. అలాంటిదేమీ లేదని.. నోట్ల కొరత ఉందన్న వాదన వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. కరెన్సీ చెలామణికి సంబంధించిన పలు ఇబ్బందులు.. సమస్యలు నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నారు. పలువురు బ్యాంకర్లు అనధికారికంగా నోట్ల షార్టేజ్ గురించి మాట్లాడటం లేనిపోని అనుమానాలకు తావిస్తోంది.
ఇదిలా ఉండగా.. తాజాగా రూ.100 నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని.. త్వరలోనే పరిస్థితులు మెరుగుపడతాయంటూ ఆర్థికశాఖ అధికార ప్రతినిధి డీఎస్ మాలిక్ తోసిపుచ్చినా.. నోట్ల షార్టేజ్ కి సంబంధించిన సందేహాలు మాత్రం ఒక కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది.
రూ.500 .. రూ.100 నోట్ల సరఫరా పెరిగి ఏటీఎంల రీ కాలిబ్రేషన్ పూర్తి అయితే ఇప్పుడున్న నోట్ల కష్టాలు పూర్తిగా తొలిగిపోతాయని చెబుతున్నారు. అయితే.. అవసరానికి సరిపడా రూ.100 నోట్ల సరఫరా లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటి ఊహాగానాలు.. మాటలు ప్రజల్లోభయాందోళనలకు గురి చేస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి ప్రచారాన్ని అడ్డుకునేలా కేంద్రం వ్యవహరించటం.. రూ.100నోట్ల ప్రింటింగ్ నిలిపివేయలేదన్న కచ్ఛిత సమాచారాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. పుకార్లను వినీవిననట్లుగా వదిలేస్తే మాత్రం లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/