Begin typing your search above and press return to search.
జైళ్లలో కరోనా విజృంభణ ... 363 మందికి పాజిటివ్ !
By: Tupaki Desk | 2 July 2020 10:30 AM GMTమహారాష్ట్ర లో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకి పెరిగిపోతుంది. ముంబై, పుణె నగరాలతోపాటు పలు పట్టణాల్లో ఈ మహమ్మారి కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్ర పోలీసులలో వైరస్ కలకలం రేపుతున్నది. జైళ్లలో సైతం కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే పలువురు ఖైదీలు, జైళ్ల సిబ్బంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటివరకు మహారాష్ట్రలోని జైళ్లలో 363 మంది ఖైదీలు, 102మంది జైలు అధికారులకు వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. జైళ్లలో నలుగురు ఖైదీలు వైరస్ వల్ల మరణించారు.
ముంబై నగరంలోని సెంట్రల్ జైలులో అత్యధికంగా 181 మంది ఖైదీలు, 44 మంది జైలు సిబ్బందికి వైరస్ వచ్చిది. పలు జైళ్లలో 255 మంది ఖైదీలు, 82 మంది జైలు ఉద్యోగులు వైరస్ నుంచి కోలుకున్నారని మహారాష్ట్ర జైళ్ల శాఖ వెల్లడించింది. ముంబైతో పాటు థానే సెంట్రల్ జైలు, తలోజా కేంద్ర కారాగారం, బైకుల్లా జిల్లా జైలు, ఎరవాడ సెంట్రల్ జైలు,ఔరంగాబాద్ సెంట్రల్ జైలు, సతారా జిల్లాజైలు, షోలాపూర్, రత్నగిరి, అకోలా, థూలే జిల్లా జైళ్లలో ఖైదీలు వైరస్ బారిన పడ్డారని మహారాష్ట్ర జైళ్ల శాఖ వెల్లడించింది.