Begin typing your search above and press return to search.
అందాల ముద్దుగుమ్మకు 8 ఏళ్ల జైలు శిక్ష..!
By: Tupaki Desk | 30 July 2022 7:39 AM GMTప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్న పాప్ సింగర్ షకీరా త్వరలో జైలుకు వెళ్లాల్సి రావచ్చని.. ఒక నెల రెండు నెలలు కాకుండా ఏకంగా 8 ఏళ్ల పాటు ఆమె జైలు జీవితం గడపాల్సి రావచ్చు అంటూ స్పెయిన్ ప్రభుత్వ వర్గాల వారు మరియు అంతర్జాతీయ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు. స్పెయిన్ లో పన్ను ఎగవేత నేపథ్యంలో షకీరా ఈ శిక్ష అనుభవించాల్సి రావచ్చు అంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... కొలంబియా కు చెందిన పాప్ సింగర్ షకీరా కొన్ని సంవత్సరాల క్రితం వాకా వాకా సాంగ్ ప్రమోషన్ లో భాగంగా స్పెయిన్ ఫుట్ బాల్ ప్లేయర్ అయిన గెరార్డ్ పైక్ తో ప్రేమలో పడింది. తన కంటే వయసులో పదేళ్లు చిన్న వాడు అయినా కూడా షకీరా అతడితో సహజీవనం మొదలు పెట్టింది.. కొన్నాళ్లకు ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు.
పెళ్లి తర్వాత పూర్తిగా స్పెయిన్ కు మకాం మార్చిన షకీరా గత కొన్ని సంవత్సరాలుగా స్పెయిన్ లోనే ఉంటుంది. కానీ స్పెయిన్ ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఆమె పన్ను చెల్లించడం లేదట. భారీగా ఆదాయం పొందుతున్న ఆమె స్పెయిన్ కు కనీస మొత్తంలో కూడా పన్ను చెల్లించక పోవడంతో ప్రస్తుతం ఆమె పన్ను బకాయి ఏకంగా 14.7 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
పన్ను చెల్లింపు కోసం అధికారులు ప్రశ్నించిన సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతుందట. అంతే కాకుండా తాను గెరార్డ్ తో విడి పోయినట్లుగా కూడా అధికారికంగా ప్రకటించింది. అతడితో సంబంధం లేదు కనుక ఇప్పుడు తాను స్పెయిన్ ప్రభుత్వంకు పన్ను చెల్లించేది లేదు అన్నట్లుగా ఆమె వాదిస్తూ వస్తుందట.
ఈ నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం అక్కడి న్యాయ స్థానం వద్దకు ఈ వ్యవహారం ను తీసుకు వెళ్లడం జరిగింది. సదరు న్యాయ స్థానంలో కనుక షకీరా పన్ను ఎగవేసినట్లుగా నిర్ధారణ అయితే అక్కడి చట్టాల ప్రకారం ఏకంగా 8 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
అంతే కాకుండా 23 మిలియన్ డాలర్ల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ జరిమానా చెల్లించలేని పక్షంలో 8 ఏళ్ల జైలు శిక్ష మరింత కాలం పెరిగినా ఆశ్చర్యం లేదని అక్కడి న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి షకీరా ఈ పెద్ద కష్టం నుండి ఎలా బయట పడుతుందో చూడాలి.