Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : జైలులో అల్లర్లు..23 మంది మృతి!

By:  Tupaki Desk   |   23 March 2020 1:30 PM GMT
కరోనా ఎఫెక్ట్ : జైలులో అల్లర్లు..23 మంది మృతి!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా దేశాలకు దేశాలు లాక్‌ డౌన్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేయడంతో దేశాల మధ్య సంబంధాలు కట్ అయిపోయాయి. మాతృదేశాలకు వెళ్లలేక అనేక మంది దేశం కానీ దేశంలో అవస్థలు పడుతున్నారు. బయట వున్న వాళ్ల పరిస్థితే ఇలా ఉంటే జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంఖ్య ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. దీనిని ముందుగానే ఊహించిన ఇరాన్ ప్రభుత్వం వేలాదిమంది ఖైదీలను ఇప్పటికే బయటకు వదిలి వేసింది.

ఈ క్రమంలో కొలంబియా రాజధాని బొగొటా జైల్లో ఖైదీలు తిరుగుబాటు చేశారు.ఈ ఘటనలో 23 మంది మరణించగా - మరో 83 మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన కొలంబియా రాజధాని బొగోటాలోనిలా మోడెలో జైలులో చోటుచేసుకుంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. లా మోడెలో జైలులో పరిశుభ్రత లేదని అందువల్ల తమకు కరోనా సోకే అవకాశం ఉందని ఖైదీలు ఆరోపించారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. జైలు అధికారులపై తిరగబడటమే కాకుండా.. అక్కడ ఉన్న సామాగ్రికి నిప్పుపెట్టారు. దీంతో అప్రమత్తమైన జైళ్ల శాఖ అధికారులు వారిని కట్టడి చేశారు.

ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 23 మంది మృతిచెందారు. ఈ ఘటనపై న్యాయశాఖ మంత్రి కాబెలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం 32 మంది ఖైదీలు - ఏడుగురు భద్రతా సిబ్బంది హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఇద్దరు భద్రతా సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. జైలులో పథకం అల్లర్లు జరిగాయని చెప్పారు. జైల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి సమస్య లేదని.. అల్లర్లు సృష్టించేందుకే ఖైదీలు ఇలా చేశారని అన్నారు. తాజా ఘటనలో పాల్గొన్న ఏ ఒక్క ఖైదీ కూడా తప్పించుకోలేడని మార్గరిటా స్పష్టం చేశారు.