Begin typing your search above and press return to search.
పదహారు మంది తలలు నరికి ఫుట్ బాల్ ఆడారు!
By: Tupaki Desk | 31 July 2019 1:30 AM GMTబ్రెజిల్ లోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ ఏకంగా 57 మంది ఖైదీల ప్రాణాలు తీసింది. అంతేకాదు.. ఓ వర్గం ఖైదీలు మరో వర్గానికి చెందిన ఖైదీల తలలు తెగ్గోసి వాటితో ఫుట్ బాల్ ఆడడం చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆ దారుణాన్ని చూశారు.
బ్రెజిల్ పారా రాష్ట్రంలోని అల్టామీరా జైల్లో సుమారు దాదాపు ఐదు గంటలపాటు ఈ గ్యాంగ్ వార్ కొనసాగింది. జైల్లో ఒక బ్యారక్ లో ఉన్న గ్యాంగ్ - అదే జైల్లో మరో బ్యారక్ వైపు వెళ్లింది.. అక్కడ వారికి వ్యతిరేక గ్యాంగ్ ఉంది. దీంతో రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో 57 మంది చనిపోగా.. అందులో 16 మందికి తలలు నరికేశారు.
ఈ ఊచకోతను అడ్డుకోవడానికి ట్రై చేసిన జైలు అధికారులను ఖైదీలు కట్టేశారు. బ్రెజిల్ మీడియాలో చూపిస్తున్న వీడియోల్లో జైల్లో ఒక భవనం నుంచి పొగలు రావడం కనిపిస్తోంది. మరో వీడియోలో ఖైదీలు జైలు భవనంపైన తిరుగుతూ కనిపిస్తున్నారు.
ఈ జైలు కెపాసిటీ 200 అయినప్పటికీ అక్కడ 311 మంది ఉన్నారని బ్రెజిల్ మీడియా చెబుతోంది. బ్రెజిల్ జైళ్లలో గ్యాంగ్ వార్ లు తరచూ జరుగుతుంటాయి. ఒకరినొకరు చంపుకొంటారు. అయితే.. ఈ స్థాయిలో చనిపోవడం.. తలలతో ఫుట్ బాల్ ఆడుకోవడం వంటివి మాత్రం దారుణం.